Telangana: మరికాసేపట్లో యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్, మంత్రులు.. కేసీఆర్‌కు పరామర్శ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఎం కేసీఆర్‌ను ఆయన పరామర్శించనున్నారు. రేవంత్ వెంట మంత్రులు కూడా వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది.

New Update
Telangana: మరికాసేపట్లో యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్, మంత్రులు.. కేసీఆర్‌కు పరామర్శ..

Telangana CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు మరికాసేపట్లో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించనున్నారు. మంత్రులతో కలిసి ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్.. ప్రజా భవన్ నుంచి ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌కి షిఫ్ట్ అయ్యారు. అయితే, శుక్రవారం నాడు అర్థరాత్రి బాత్‌రూమ్‌లో జారిపడ్డారు కేసీఆర్. దాంతో ఆయన తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయ్యింది. యశోద ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజున వైద్యులు కేసీఆర్‌తో కాస్త నడిపించారు.

కేసీఆర్‌ను రేవంత్ కలవడంపై ఆసక్తి..

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వర్సెస్ కేసీఆర్(KCR).. పోరు ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం ఉంటుంది. అలాంటిది రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్‌ను కలవడం ఆసక్తిని రేపుతోంది. ఎన్నికల సమయంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read:

ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!

పైసల్లేక పట్నం నుంచి నడిచొచ్చినా.. రూపాయి చిక్క దొరికితే బస్సు ఎక్కిన: జగ్గారెడ్డి

Advertisment
తాజా కథనాలు