Rythu Runa Mafi: పంద్రాగస్టు రోజున రైతులకు రుణాల నుంచి విముక్తి చేసేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఈరోజు తెలంగాణలో (Telangana) మూడో విడత రుణమాఫీ చేయనుంది. ఆగస్టు 15వ తేదీ లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గతంలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే , ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.1,50,000 రైతు రుణాలను మాఫీ చేసింది రేవంత్ సర్కార్.
ఈరోజు రూ.1,50,000 నుండి రూ.2,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది. ఈరోజు రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ కానున్నాయి. ఖమ్మం జిల్లా (Khammam) వైరా మండలంలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మూడో విడత నిధులను విడుదల చేయనున్నారు. కాగా ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరో రెండు గ్యారెంటీలు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2500 వంటి పథకాలను ఈరోజు ప్రారంభిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో నెలకొంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో ఎలాంటి హామీల వర్షం కురిపిస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. కాగా ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో (Six Guarantees) రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేసింది.మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే గ్యాస్ సిలిండర్ రూ.500లకు అందించింది. అయితే.. ఈరోజు పర్యటనలో సీఎం రేవంత్ ఏం ప్రకటన చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read: త్వరలో ఎకరాకు రూ.15,000.. సీఎం కీలక ప్రకటన