CM Revanth Reddy: కేసీఆర్‌పై రేవంత్ బిగ్ స్కెచ్.. రేపే ముహూర్తం రేపు నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ, విద్యుత్ శాఖలపై శ్వేత పత్రాలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. రేపు విడుదల చేసే శ్వేత పత్రంలో ఏ స్థాయిలో అప్పులు, అవకతవకలు ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. By V.J Reddy 11 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆరే (KCR) టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను (Telangana Debts), తప్పులను ప్రజల ముందుకు తేనున్నారు. ఇప్పటికే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చేసిన అప్పులను, వివిధ శాఖల్లో ఉన్న అప్పులపై శ్వేతా పత్రం (White Paper) విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్ (Congress). మరో ఆటకు రేవంత్ సై... తాజాగా నీటి పారుదల శాఖపై (Irrigation Department) ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. పూలే ప్రజాభవన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగనుంది. కృష్ణా జలాలు (Krishna River Issue), నీటి పారుదల అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నీటి పంపకాలపై సభలో ఎలా వ్యవహరించాలో సభ్యులకు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. ALSO READ: ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు.. అడియాశలే? బీఅర్ఎస్ ను తిప్పికొట్టేందుకే... తెలంగాణ రాజకీయాలు KRMB చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వమే కేంద్రానికి అప్పగించింది కాంగ్రెస్.. హే లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే కేంద్రానికి అప్పగించింది బీఆర్ఎస్ పార్టీ.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. కృష్ణ జలాల పంపకంపై కాంగ్రెస్, బీఅర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఇంకా ఎండ్ కార్డు పదాలే లేదు. అసెంబ్లీలో బీఅర్ఎస్ మాటలదాడిని తిప్పికొట్టేందుకు సమాయత్తం చేస్తోంది. రేపే కేసీఆర్ కు క్లైమాక్స్?... రేపు నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ, విద్యుత్ శాఖలపై శ్వేత పత్రాలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. రెండు శాఖల్లో భారీగా అప్పులు బయటపడ్డాయి. రేపు నీటి పారుదల శాఖపై విడుదల చేసే శ్వేత పత్రంలో ఏ స్థాయిలో అప్పులు, అవకతవకలు ఉంటాయన్నదానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. DO WATCH: #kcr #cm-revanth-reddy #brs-party #krmb-issue #krishna-river-board మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి