CM Revanth: దావోస్‌‌కు సీఎం రేవంత్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు!

సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమ్మిట్‌కు హాజరుకానున్నారు. 6 గ్యారెంటీల అమలు, ఎంపీ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రేవంత్.

CM Revanth : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు!
New Update

CM Revanth Reddy: జిల్లాల వారీగా ఇంఛార్జ్‌ మంత్రులు (Ministers), ఎమ్మెల్యేలతో (MLA's) సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు MCRHRD లో ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో భేటి అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు, మరికొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ALSO READ: ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

పార్లమెంట్ ఎన్నికలు.. టార్గెట్ 12...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) పార్లమెంట్ ఎన్నికలపై (Parliament Elections) కసరత్తు చేస్తోంది. గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని అన్నారు.

నిజమైన లబ్దిదారులకే 6 గ్యారెంటీలు..

నిజమైన లబ్ధిదారులకే ప్రభుత్వ అందిస్తున్న పథకాలు చేరాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీల నియామకం చేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నిజాయితీ, నిబద్దత ఉన్న అధికారులను నియమించుకోవాలని అన్నారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు నో ఛాన్స్‌ అని స్పష్టం చేశారు.

దావోస్‌ కు సీఎం రేవంత్..

సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 15న దావోస్‌ కు సీఎం రేవంత్‌ రెడ్డి వెళ్లనున్నారు. 20వ తేదీ వరకు దావోస్‌లో ఉండనున్నారు. అక్కడ జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమ్మిట్‌కు హాజరుకానున్నారు. తర్వాత మూడు రోజుల పాటు లండన్‌ లో పర్యటించనున్నారు. యూకేలో జరిగే సదస్సులో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌.

ALSO READ: కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే డేంజర్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

#cm-revanth-reddy #dharani-portal #mp-elections-2024 #congress-six-guarantees #cm-revanth-davos-tour
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe