తెలంగాణలో రహాదారుల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష జరిపారు. రహదారులకు భూసేకరణ చేపట్టే ప్రక్రియలో ఎందుకు ఆలస్యం జరుగుతుందోనని కలెక్టర్లను ప్రశ్నించారు. అయితే రిజిస్ట్రేషన్, మార్కెట్ ధరల మధ్య ఎక్కువగా తేడా ఉండటం వల్లే రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో భూసేకరణ చేపట్టేందుకు మానవీయ కోణంలో వ్యవహరించాలమని.. రూల్స్ ప్రకారం రైతులకు ఎక్కువగా పరిహారం దక్కేలా చూడాలని సూచనలు చేశారు.
Also read: వాళ్లకు రుణమాఫీ బంద్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం !
అలాగే భూములు కోల్పోతున్న రైతులను పిలిచి కలెక్టర్లు మాట్లాడాలని.. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నంబర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్‌ఏఐ త్రైపాక్షిక ఒప్పందానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్మూర్ - నాగ్‌పూర్ కారిడార్‌కు ప్రభుత్వ భూములను కేటాయించాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ - మన్నెగూడ పనులు త్వరగా చేపట్టాలని ఆదేశించారు. ఇక హైదరాబాద్ - విజయవాడ రహదారి విస్తరణ పనులు మరో రెండు నెలల్లోనే ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Also read: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు