CM Revanth Reddy : ఎప్పుడు పోదాం చెప్పు?.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి గరం

మేడిగడ్డ పై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, తరువాత జుడీషియల్‌ విచారణలో దోషులు తెలుతారని సీఎం రేవంత్ అన్నారు. కాళేశ్వరం టూర్‌కు ప్రతిపక్ష నాయకుడుకి ఎప్పుడు టైం ఉందో చెప్పాలని కోరారు. ఒక రోజు ముందు వెనుక అయినా తాము రెఢీ గా ఉన్నామని అన్నారు.

New Update
CM Revanth Reddy : ఎప్పుడు పోదాం చెప్పు?.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి గరం

CM Revanth Reddy : ఈరోజు మీడియా తో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Ex. CM KCR) పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ అసెంబ్లీ ఎందుకు రావడం లేదో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ప్రతిపక్ష నేతల అసెంబ్లీ వచ్చి సలహాలు సూచనలు ఇస్తారని అనుకున్నాం కానీ.. ఆయన అసలు అసెంబ్లీకే రావడం లేదని.. దీంతో కేసీఆర్ కు తెలంగాణ(Telangana) ప్రజలపైన ఎంత బాధ్యత ఉందొ అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

ALSO READ: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

డేట్ చెప్తే పోదాం..

గత బడ్జెట్ కంటే 70వేల కోట్లు మైనస్ అయిందని.. 23శాతం బడ్జెట్ తగ్గిందని అన్నారు సీఎం రేవంత్. గతంలో బడ్జెట్లు అబద్ధాలతో నడిపించారని ఆరోపించారు. మేము అబద్ధాలతో బడ్జెట్ పెట్టలేదు... మొదటి రోజే నిజం చెప్పాలి అనుకున్నాం అని అన్నారు. ఇరిగేషన్ లో గతంలో 16వేల కోట్లు అప్పులు కట్టారని పేర్కొన్నారు. అక్కర లేకున్నా పిలిచిన టెండర్లు రద్దు చేస్తాం అని అన్నారు. రుణమాఫీ రద్దు చేస్తాం... బ్యాంక్ లతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఇరిగేషన్ పై శ్వేత పత్రం పెడతాం, కాగ్ నివేదిక సైతం పెడతాం అని అన్నారు. మేడిగడ్డ(Medigadda) కు ప్రతిపక్ష నాయకులను సైతం పిలువనునట్లు తెలిపారు. మేడిగడ్డ పై విజిలెన్స్ విచారణ జరుగుతోంది... తరువాత జుడీషియల్‌  విచారణలో దోషులు తెలుతారని అన్నారు. కాళేశ్వరం టూర్ కు ప్రతిపక్ష నాయకుడుకి ఎప్పుడు టైం ఉందో చెప్పాలని కోరారు. ఒక రోజు ముందు వెనుక అయినా తాము రెఢీ గా ఉన్నామని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభ కు రావడం లేదు కదా మాట్లాడుదాం అంటే అంటూ చురకలు అంటించారు.

Also Read : ఆరు గ్యారెంటీలే హైలైట్..సమానత్వమే లక్ష్యంగా..తెలంగాణ మధ్యంతర బడ్జెట్!

DO WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు