Telangana Assembly: కేసీఆర్ ఎక్కడ దాక్కున్నావ్.. అసెంబ్లీలో రెచ్చిపోయిన సీఎం రేవంత్
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు సీఎం రేవంత్. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని.. కానీ, కేసీఆర్ సభకు రాకపోవడం సభను అవమానించడమేనన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదో చెప్పాలని BRS నేతలను ప్రశ్నించారు.
CM Revanth Reddy Comments On KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి (Telangana Assembly) రాకపోవడంపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ (KCR) ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని అన్నారు సీఎం రేవంత్. కానీ, ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం సభను అవమానించడమే అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలంగాణ అంటే ఓకే ఎమోషన్ అని అన్నారు.
అందరం టీజీ అనే అనుకున్నాం...
తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ (TG) అని రాసుకునేవాళ్లం అని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొంది అని వివరించారు. అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్ అని పెట్టిందని ఫైర్ అయ్యారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ట్ర అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
అందుకే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు...
రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాజరిక ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు సీఎం రేవంత్. ప్రజాస్వామ్య పాలనలో రాజరికం ఉండకూడదని భావిస్తున్నాం అని అందుకే రాష్ట్ర చిహ్నంలో (State Symbol) మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ తల్లి (Telangana Talli Statue) అంటే.. మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తుకు రావాలని అన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదని అన్నారు. తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలని తెలిపారు.
ఇంకా నెరవేరలేదు...
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ప్రజలు కన్నా కలలు ఇంకా నెరవేరలేదని అన్నారు. తెలంగాణ అంటే మనకు ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

Also Read: గ్రూప్-1 వయోపరిమితి పెంపు