CM Revanth Reddy: సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం.. ప్రజాపాలన వెబ్‌సైట్‌ ప్రారంభం..

సీఎం రేవంత్ రెడ్డి తాజాగా 'ప్రజాపాలన' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. https://prajapalana.telangana.gov.in/ పేరుతో కాంగ్రెస్ సర్కార్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ దరఖాస్తు స్టేటస్‌ తెలుసుకునే ఛాన్స్‌ ఉంటుంది.

Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
New Update

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రజాపాలన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. https://prajapalana.telangana.gov.in పేరుతో కాంగ్రెస్ సర్కార్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ దరఖాస్తు స్టేటస్‌ తెలుసుకునే ఛాన్స్‌ ఉంటుంది. ముందుగా మీకు ఇచ్చిన రశీదుపై ఉన్న నంబర్ ద్వారా లాగిన్ కావాలి. ప్రస్తుతం కొనసాగుతున్న దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియ, డేటా ఎంట్రీ పూర్తయ్యాక వెబ్‌సైట్‌లోని ప్రజల దరఖాస్తు వివరాలు అందుబాటులో ఉంటాయి.

Also Read: వాళ్లు నాతో టచ్‌లో ఉన్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసందే. అయితే ఈ కార్యక్రమంలో కోటి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా ఈ కార్యక్రామాన్ని ముందుకు తీసుకొచ్చింది హస్తం పార్టీ. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోన్న సంగతి తెలిసిందే. అయితే మిగతా గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది.

Also read: 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మానవయాత్రకు సిద్ధమైన అమెరికా

ఇదిలాఉండగా.. కొంతమంది పలు కారణాల వల్ల ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోకపోవడంతో ఆందోళన చెందారు. ఈ అంశంపై కాంగ్రెస్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ప్రతి నాలుగు నెలలకొకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని.. అప్పుడు మళ్లీ ఈ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టతనిచ్చింది.  అలాగే అర్హులు ఎవరైనా ఉంటే ఎమ్మార్వో కార్యాలయంలో కూడా ఇప్పుడు దరఖాస్తులు సమర్పించుకోవచ్చని పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తుందనే దానిపై అటూ విపక్ష పార్టీలు, ఇటు ప్రజల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తాము కచ్చితంగా 100 రోజుల్లో మరో ఐదు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామంటూ చెబుతున్నారు.

#cm-revanth-reddy #telangana-news #telugu-news #congress #prjapalana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe