CM Revanth Reddy: కడప ఉప ఎన్నిక మీద రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

కడపలో ఉప ఎన్నిక వస్తుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గల్లీ గల్లీ తిరుగుతూ కడప పౌరుషాన్ని ఢిల్లీని తాకేలా చేస్తానన్నారు.

New Update
CM Revanth Reddy: కడప ఉప ఎన్నిక మీద రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

Kadapa By Elections: కడపలో ఉప ఎన్నిక వస్తుందా అంటే అవుననే అని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ (YS Jagan) రాజీనామా చేసి ఆయన బార్య వైఎస్ భారతిని నిలబెడతారని..అదే సమయంలో అవినాష్​ రెడ్డిని ఎంపీగా రాజీనామా చేయించి ఉప ఎన్నిక బరిలో జగన్​ దిగుతారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని...జగన్ అలాంటి సాహసాలు చేయరని పార్టీ వర్గాలు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ విషయం మీద చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి.

కడప ఉప ఎన్నిక వస్తుందట..అదే కనుక జరిగితే నేను భాధ్యత తీసుకుంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.కడప పౌరుషాన్ని డిల్లీకి తాకే సందర్భం వస్తే..కడప లోనే ఉంట...గల్లి గల్లి తిరుగుతా అని అన్నారు. తానే స్వయంగా ప్రచారం చేస్తానని చెప్పారు. ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు. అందుకే ఇదే గడ్డ నుంచి పోరాటం మొదలు పెడతామని చెప్పారు. మీరందరు కూడా కలిసి రండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు