CM Revanth Reddy : అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇవాళ మీడియాతో జరిగిన చిట్ చాట్(Chit Chat) లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Ex.CM KCR) టార్గెట్ గా విమర్శలు చేశారు. మేడి గడ్డ(Medigadda) కు వెల్లేదే ఫ్లోర్ లీడర్ కోసమే అని కేసీఆర్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఫ్లోర్ లీడర్ రాకపోతే ఎవరు వస్తారో ప్రతిపక్ష నేత చెప్పాలని అన్నారు.
హరీష్ అర్థం పర్థం లేకుండా..
హరీష్ రావు(Harish Rao) సభలో ఇన్ని ఏళ్ల నుంచి ఉండి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో టీడీపీ(TDP) నుంచి ఒక వ్యక్తి బదులు మరో వ్యక్తి పేరు ఇచ్చినా స్పీకర్ ఆనాడు అనుమతి ఇవ్వలేదని అన్నారు. ఆనాడు ఎర్రబెల్లి పేరును అంశంలో హరీష్ రావు మంత్రిగా ఉన్నాడని గుర్తు చేశారు. తన భాషపై విమర్శలు ఎందుకు? అని అన్నారు.
కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు...
త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు చేరుతారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇతర పార్టీ ఎమ్మెల్యే లు తమ పార్టీలోకి వచ్చే అంశం తన దృష్టిలో లేదని అన్నారు. ఎవరైనా వచ్చేందుకు రెఢీగా ఉంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని అంచానా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఎంత మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారనేది చూడాలి.
Also Read : BJP Modi Politics : గాంధీయేతర నాయకులే టార్గెట్.. కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసే మోడీ వ్యూహం
కేసీఆర్ కు ముందు ఉంది?..
తెలంగాణ(Telangana) అంటేనే అబద్ధాలు అనే పర్యాయ పదం తెచ్చిండు కేసీఆర్ అని రేవంత్ అన్నారు. తెలంగాణ అంటే నిజం ..దాన్ని మళ్ళీ తెచ్చారు భట్టి విక్రమార్క అని అన్నారు. 60 రోజుల్లో బడ్జెట్ అంచనాలు భట్టి కి వచ్చింది... పదేళ్లు అయినా కేసీఆర్ కు మాత్రం రాలేదని విమర్శించారు. అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ పై విచారణకు అదేశిస్తాము అని స్పష్టం చేశారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చుల పై విచారణ కు ఆదేశిస్తామని అన్నారు. పవర్ లో మూడు, ఇరిగేషన్ పై విచారణ, మిషన్ భగీరథ పై విజిలెన్స్ విచారణ నడుస్తోందని అన్నారు.
శ్యాండ్ పాలసీ త్వరలో...
శ్యాండ్ పాలసీ పై త్వరలోనే ప్రకటన చేస్తామని అన్నారు. పథకాలకు రేషన్ కార్డులు లేకపోతే.. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు సీఎం రేవంత్. ఆరోగ్య శ్రీ పథకం రేషన్ కార్డు తో సంబంధం లేకుండా ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం చేసే రైతుకు భరోసా ఇస్తామన్నారు. ఇప్పుడు వ్యవసాయం చెయ్యని వాళ్ళకే ఎక్కువ రైతు బంధు వస్తోందని అన్నారు.