Telangana : మహాలక్మి పథకంలో మరో రెండు గ్యారంటీలకు ఉత్తర్వులు జారీ! తెలంగాణ గవర్నమెంట్ మహాలక్మి పథకంలో భాగంగా మరో రెండు గ్యారంటీలకు ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కు సంబంధించి అర్హత లిస్ట్ విడుదల చేసింది. By srinivas 27 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి 2 Guarantees : తెలంగాణ(Telangana) గవర్నమెంట్ మహాలక్మి పథకం(Mahalakshmi Scheme) లో భాగంగా మరో రెండు గ్యారంటీలకు(2 Guarantees) ఉత్తర్వులు జారీ చేసింది. గృహజ్యోతి పథకం(Gruha Jyothi Scheme) కింద రేషన్‌కార్డు ఉన్నవారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీలను సీఎం నేడు ప్రారంభించారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకే.. ఈ మేరకు మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్ ప్రకారం తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తింస్తుందని స్పష్టం చేసింది. ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్నవారు పథకానికి అర్హులుగా పేర్కొంటూ.. మహిళా పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని చెప్పింది. గత మూడేళ్ల సిలిండర్ల వినియోగాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుండగా..రూ. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీంకి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్(Subsidy Gas Cylinder) కోసం మూడు క్రైటీరియాలను ప్రకటించిన ప్రభుత్వం.. సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలన(Praja Palana) లో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల మంది లబ్ధిపొందనున్నారు. ఇది కూడా చదవండి : TSPSC:నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ వారమే డీఎస్సీ నోటిఫికేషన్!? Also Read : Telangana: తీవ్ర ఉద్రిక్తతగా బండి సంజయ్ ప్రజాహిత యాత్ర #telangana #mahalakshmi-scheme #cm-reavanth-reddy #2-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి