Telangana : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిగ్ ప్లాన్ వేస్తున్నారు. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీ (Sonia Gandhi) ని తీసుకొచ్చి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ (Congress) అని వివరించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ కేసీఆర్ కు దక్కకుండా చేసేందుకే రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేరళలో పర్యటిస్తున్న రేవంత్ నేరుగా అక్కడినుంచి ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Hyderabad: 161 కి.మీ, 11 టోల్‌ప్లాజాలు.. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు హైలెట్స్ ఇవే!
అలాగే తెలంగాణ ఉద్యమకారుల కోటాలో కేసీఆర్ (KCR), ఈటల, హరీష్ రావు, బండిసంజాయ్, కిషన్ రెడ్డితోపాటు కళాకారులు, గాయకులను ఆహ్వానం పంపి సోనియా చేతులమీదుగా సన్మానం దిశగా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగానే పీసీసీ మార్పు, రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ అంశాలపై సోనియా అనుమతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బరిలో నిలిచే అవకాశం లభించని వారంతా క్యాబినెట్ లో చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు.