Hyderabad : వెంకయ్యనాయుడు, చిరంజీవిలను సన్మానించిన సీఎం రేవంత్‌

ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషన్‌కు ఎంపికైన తెలుగువారిని ఈ రోజు శిల్పకళా వేదికగా తెలంగాణ గవర్నమెంట్ ఘనంగా సన్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల సమక్షంలో వెంకయ్య నాయుడు, చిరంజీవిలకు జ్ఞాపికను అందించి శాలువతో సత్కరించారు.

New Update
Hyderabad : వెంకయ్యనాయుడు, చిరంజీవిలను సన్మానించిన సీఎం రేవంత్‌

Shilpakala Vedika : ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషన్‌(Padma Vibhushan) కు ఎంపికైన తెలుగువారిని ఈ రోజు శిల్పకళా వేదిక(Shilpakala Vedika) గా తెలంగాణ(Telangana) గవర్నమెంట్ ఘనంగా సన్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రుల సమక్షంలో వెంకయ్య నాయుడు(Venkaiah Naidu), చిరంజీవి(Chiranjeevi) లకు జ్ఞాపికను అందించి శాలువతో సత్కరించారు. అలాగే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్యలను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గర్వకారణంగా ఉంది..
తెలుగు సినిమాకి చేసిన సేవలకుగాను మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును ఇటీవల ప్రకటించింది భారత ప్రభుత్వం. ఇంతటి ఘనతన సాధించినందుకు చిరంజీవికి సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు కూడా చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషన్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చిరుకు అవార్డు రావడం తెలుగువారికి గర్వకారణమని రేవంత్ అన్నారు.

ఇది కూడా చదవండి: Mylavaram: వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే?

హైదరాబాద్ లో విందు..
చిరంజీవి తనకు పద్మవిభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్(Hyderabad) లో విందు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా వచ్చారు. మెగాస్టార్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేవంత్ రామ్ చరణ్ తో కాసేపు ముచ్చటించారు. ఈ విందుకుశాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Advertisment
తాజా కథనాలు