Farmers : రైతులకు శుభవార్త.. మరో పదిరోజుల్లో రైతుబంధు పంపిణీ పూర్తి చేసేలా రేవంత్ ఆదేశం.. 10 రోజుల్లో రైతుబంధు నిధుల పంపిణీ పూర్తి చేయాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. ఇప్పటివరకు 4 ఎకరాల్లోపు ఉన్నవారికి మాత్రమే రైతుబంధు డబ్బులు రావడంతో అయోమయం నెలకొంది. ఇక ఖరీఫ్ నుంచి రైతుభరోసా పథకం అమలు చేయనుంది కాంగ్రెస్ సర్కార్. By B Aravind 03 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Farmers : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రైతుబంధు(Rythu Bandhu)కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 10 రోజుల్లో రైతుబంధు నిధుల పంపిణీ పూర్తి చేయాలని ఆర్థికశాఖ అధికారులకు ఆయన ఆదేశించారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 4 ఎకరాల లోపు ఉన్న వాళ్లకు మాత్రమే రైతుబంధు డబ్బులు వచ్చాయి. దీంతో మిగిలిన లబ్ధిదారులు కూడా రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు వేసిన వెంటనే మిగిలిన వాళ్లకు రైతుబంధు వేయనున్నట్లు తెలుస్తోంది. Also Read : మరో పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి.. ఏపీ హైకోర్టులో పిల్ రైతుల్లో అయోమయం అయితే ఖరీఫ్ నుంచి రైతుభరోసా పథకం అమలు చేయనుంది కాంగ్రెస్ సర్కార్(Congress Sarkar). ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలోని రైతుబంధు లబ్ధిదారులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. కొందరికి వచ్చి మరికొందరికి రాకపోవడంతో.. తమ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయా రావా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా మరో పదిరోజుల్లో రైతుబంధు నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో వేసేలా సీఎం అధికారులకు ఆదేశించడంతో మిగిలిన రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. 5 ఎకరాల లోపు ఉన్నవారికే రైతుభరోస ? గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) ఎకరానికి రూ .5 వేలు ఇచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ ఇచ్చినట్లుగానే.. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఎకరానికి రూ.5 వేలు ఇచ్చేలా రైతుబంధు నిధులు పంపిణీ చేస్తోంది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్.. ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖరీఫ్ నుంచి రైతుబంధు పథకం రైతు భరోసా(Rythu Barosa) గా మారనుంది. 5 ఎకరాల వరకు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అందించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. Also Read : నేటి నుంచి పల్స్ పోలియో వ్యాక్సిన్ డ్రైవ్! #telugu-news #telangana #national-news #rythu-barosa #rythu-bandhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి