BREAKING: ముగిసిన సీఎంల భేటీ.. విభజన సమస్యలపై కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈ సమవేశంలో చర్చించారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల నుంచి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఒకటి మంత్రుల కమిటీ, మరొకటి అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

BREAKING: ముగిసిన సీఎంల భేటీ.. విభజన సమస్యలపై కీలక నిర్ణయం
New Update

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. సుమారు రెండుగంటల పాటు ఈ సమావేశం జరిగింది. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈ సమవేశంలో చర్చించారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల నుంచి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఒకటి మంత్రుల కమిటీ, మరొకటి అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

Also Read: ఇకనుంచి ఏడాదికి రెండు సార్లు టెట్‌ పరీక్ష

ఏపీలో కలిసిన 7 మండలాల్లో 5 గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని సీఎ రేవంత్.. చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగుడెం, పిచ్చకలపాడు పంచాయితీలు కావాలని కోరారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్న కొన్ని భవనాలను తమకే కేటాయించాలని ఏపీ ప్రభుత్వం అడగ్గా.. దీనికి రేవంత్ సర్కార్‌ తిరస్కరించినట్లు సమాచారం. షెడ్యూల్‌ 9, 10లో ఉన్న అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, బి.సి.జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, ఇతర అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.

Also Read: ముంబయిలో విజయోత్సవ ర్యాలీ.. రోడ్డుపై 11,500 కిలోల చెత్త

ప్రధానంగా చర్చించిన అంశాలివే..
1.రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు
2.పెండింగ్‌ విద్యుత్తు బిల్లులు
3.విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటికి సంబంధించి అప్పుల పంపకాలు
4.ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపు అంశం
5.ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ అంశాలు
6.హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశం
7.లేబర్‌ సెస్‌ పంపకాలు
8.విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు
9. ఉద్యోగుల విభజన అంశాలు

#cm-revanth #telugu-news #cm-chandra-babu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe