Mumbai: ముంబయిలో విజయోత్సవ ర్యాలీ.. రోడ్డుపై 11,500 కిలోల చెత్త జులై 4న ముంబయిలోని మెరైన్ రోడ్డులో టీమిండియా విజయోత్సవ ర్యాలీకి వేలాదిమంది అభిమానులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. అయితే ర్యాలీ జరిగిన రోడ్డుపై ఏకంగా 11,500 కిలోల చెత్త పేరుకుపోయింది. ముస్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ రాత్రంతా కష్టపడి చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. By B Aravind 06 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి జులై 4న ముంబయిలోని మెరైన్ రోడ్డులో టీమిండియా విజయోత్సవ ర్యాలీ జరిగిన సంగతి తెలిసిందే. టీ-20 ప్రపంచ కప్ గెలిచిన భారత ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్లో నిల్చొని ట్రోఫితో అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు. తమ అభిమాన ప్లేయర్లను చూసేందుకు వేలాదిమంది క్రికెట్ ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. ఏకంగా 1.7 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు అభిమానులతో కిక్కిరిసిపోయింది. సుమారు రెండు గంటలకు పైగా ఈ పరేడ్ జరిగింది. అయితే పరేడ్ ముగిశాక అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఆ రోడ్డుపై మాత్రం పెద్ద మొత్తంలో వ్యర్థ పదార్థాలు, చెత్త అలాగే ఉండిపోయింది. Also Read: ఇకనుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష ఆరోజు రాత్రి 11.30 గంటలకు పారిశుద్ధ్య కార్మికులు రంగంలోకి దిగారు. రోడ్డుపై పేరుకుపోయిన ప్లాస్టిక్ బాటిళ్లు, బట్టలు, చెప్పులు, షూలు, కప్పులు, పేపర్లు ఇలాంటివన్నింటినీ కూడా శుభ్రం చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ రోడ్డుపై ఏకంగా 11,500 కిలోల చెత్త పేరుకుపోయింది. అయినప్పటికీ కూడా బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సిబ్బంది ఆ రాత్రంతా కష్టపడి చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. మొత్తం క్లీనింగ్ ఆపరేషన్ తర్వాతి రోజు ఉదయం 8 గంటల నాటికి పూర్తయ్యింది. 🏆 A sea of cricket fans gathered at Marine Drive in Mumbai until late last night to welcome the Indian Cricket Team after their victory in the T20 Cricket World Cup 2024. 🧹 After the grand welcome and once the crowd dispersed, Brihanmumbai Municipal Corporation (BMC) conducted… pic.twitter.com/JruPxUAfLo — माझी Mumbai, आपली BMC (@mybmc) July 5, 2024 అయితే ఆ రోడ్డుపై ప్రతిరోజూ ఉదయం వాకింగ్ చేసేందుకు చాలామంది వస్తుంటారు. ఈనేపథ్యంలో వాళ్లకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ రాత్రంతా శ్రమించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పారిశుద్ధ్య కార్మికులపై నెటీజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే రోడ్డుపై సేకరించిన చెత్తను.. రీప్రాసెసింగ్ చేసేందుకు తరలించాలని బీఎంసీ భావిస్తోంది. A big thank you to the sanitation workers of the Mumbai Municipal Corporation. Before the citizens who celebrated the World Cup victory parade woke up, the sanitation workers had already cleaned and tidied up the Marine Drive area. The previous night, the Marine Drive area was… pic.twitter.com/VJvDaPDCUC — Vaibhav Kokat (@ivaibhavk) July 5, 2024 AN UNFORGETTABLE DAY 💙 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆#TeamIndia | #T20WorldCup | #Champions pic.twitter.com/FeT7VNV5lB — BCCI (@BCCI) July 4, 2024 Also Read: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.! #t20-world-cup #telugu-news #mumbai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి