Telangana: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: సీఎం రేవంత్

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో ఉన్న సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించారు. అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఫ్యూచర్‌ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Telangana: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: సీఎం రేవంత్
New Update

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో ఉన్న సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామన్నారు. '' గతంలోనే జర్నలిస్టులకు ఇళ్లు కట్టించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహారించాలి.

Also Read: హైదరాబాద్‌లో ఆ 8విల్లాల కూల్చివేత.. మరో 12 విల్లాలకు నోటీసులు!

మా ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపించింది. గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జర్నలిస్టులకు లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే అసెంబ్లీ లోపలికి జర్నలిస్టులను అనుమతించాలని కోరాను. ఏ వర్గంలో అయినా కూడా కొందరు చేసే పనులు వల్లే ఇబ్బంది కలుగుతుంది. గతంలో సచివాలయానికి వెళ్లడానికి మాకే పర్మిషన్ ఉండేది కాదు. కొంతమందికి పాస్‌లు ఇచ్చి లోపలికి రప్పించి ఇబ్బందులు కలిగిస్తున్నారు. అలాంటి వారందరిని కట్టడి చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపైనే ఉంది.

Also Read: బాసర ట్రిపుల్ఐటీలో మళ్లీ ఆందోళనలు.. ఎందుకంటే ?

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు, ఇళ్ల పట్టా, హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. వ్యవస్థల మీద నమ్మకం పెంచాలన్నదే తమ లక్ష్యం. ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుదా ఎదురు చూసిన జవహర్‌లాల్ నెహ్రూ జర్నిలిస్టు హౌసింగ్‌ సొసైటీలో 73 మంది నిజాన్ని చూడకుందే కన్నుముశారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు అందిస్తున్నాం. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఫ్యూచర్‌ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని''రేవంత్ అన్నారు.

#hyderabad #telugu-news #telangana #cm-revanth
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe