CM Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్.. హైకోర్టులో పిటిషన్ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. By V.J Reddy 23 Mar 2024 in Latest News In Telugu Uncategorized New Update షేర్ చేయండి CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. మరి కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ దేశ రాజకీయాల్లో నెలకొంది. ALSO READ: కేసీఆర్ కుటుంబంలో మరొకరు అరెస్ట్ ఆరు రోజుల కస్టడీ.. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఆయనకు ఆరు రోజుల ఈడీ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో ప్రవేశ పెట్టాలని ఈడీ అధికారులకు ఆదేశాలిచ్చింది. అయితే.. లిక్కర్ స్కాం కేసులో విచారించేందుకు కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోర్టును కోరగా.. ఆరు రోజుల కస్టడీ ఇస్తూ కోర్టు తన తీర్పును వెలువరించింది. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: ఆప్ మంత్రి లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజులు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై స్పందించారు ఆప్ నేత, మంత్రి అతిషి మార్లేనా. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ని అడ్డం పెట్టుకొని బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఈడీ అనేది బీజేపీ పార్టీలో ఒక భాగమా? అని నిలదీశారు. ఈడీ ఇవ్వాల్సిన ప్రెస్ రిలీజ్లను బీజేపీ నేతలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు ఆప్ నేతలు ఎలాంటి నేరాలకు పాల్పడినట్లు ఈడీ కనుగొనలేదని అన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి ఈరోజు చీకటి రోజు అని ఆమె తెలిపారు. బీజేపీ భారత్ లో ప్రజాస్వామ్యాన్ని ఎలా కూని చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కవితతో కలిపి విచారణ? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ తగిలింది.. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. ఇరు వర్గాల వాదనను విన్న కోర్టు ఈడీ (ED) వాదనతో ఏకీభవించింది. అయితే ఐదు రోజులు కాకుండా మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. ఈ క్రమంలో లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ తో కలిసి కవితను ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. #kavitha #cm-kejriwal #ed-delhi-liqour-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి