Palamuru Rangareddy : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పూజా కార్యక్రమాల తర్వాత ఒక ప్రాజెక్టులో మోటారును స్విచ్​ఆన్ ​చేసి ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారు.

Palamuru Rangareddy : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
New Update

Palamuru Rangareddy Lift Irrigation Project: తెలంగాణ ఫ్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన పాలమూరు-రంగారెడ్డి ఈరోజు ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ ఈ ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా నాగర్ కర్నూలు వెళ్లనున్న సీఎం.. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు నార్లాపూర్ రిజర్వాయర్ సమీపంలోని కంట్రోల్ రూమ్ చేరుకుంటారు. మధ్యాహ్నం మూడున్నర గంటకు ప్రాజెక్టు స్విచ్ ఆన్ చేస్తారు.దీనిని కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నట్లు ప్రకటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కొల్భాపూర్ పట్టణం మొత్తం గులాబీ మయం అయిపోయింది. వారం రోజులగా ముఖ్యమంత్రి సభ కోసం ఉన్నతాధికారులు ఇక్కడ ఏర్పాట్లను చేస్తున్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన మొదటి పంప్ హౌస్ ఇప్పటికే రెడీగా ఉంది. నీటిని ఎత్తి పోసేందుకు రెండు మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. మొదటి పంప్ డ్రైరన్ కూడా సక్సెస్ అయింది. అందులో బాగంగానే ఈరోజు వాటర్ లిఫ్టింగ్ చేయనున్నారు. నార్లాపూర్ 145 మెగావాట్ల సామర్ధ్యం గల మోటార్లను సీఎం కేసీఆర్ స్విచ్ ఆన్ చేసి నీటి లిఫ్ట్ ను ప్రారంభిస్తారు. తర్వాత అంజనగిరి జలాశయంలో కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు. అనంతరం కొల్లాపూర్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.

ఇదంతా సీఎం కేసీఆర్ ఎన్నికల స్ట్రాటజీ అని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో సిద్ధం కాకున్నా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి దాదాపు ఎనిమిదిన్నర సంవత్సరాల(2015లో ) క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సర్వేలు చేపట్టి పాలమూరు-రంగారెడ్డి పథకాన్నిప్రారంభించింది. కానీ పలు కారణాలతో ఆ పథకం నత్త నడకన సాగుతోంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రిజర్వాయర్లు సిద్ధం కాలేదు.
ఎన్నికల నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డి పథకం ఆయా నియోజకవర్గాల్లోని తమ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఇలా హఠాత్తుగా ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమయ్యారని మండిపడుతున్నారు.
కానీ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక బీడు భూములు పచ్చబడతాయని, తమ జీవితాలు బాగుపడతాయని భావిస్తున్నారు.

#kcr #project #water #scheme #cm #lift #palamuru #start #teleangana #ranagareddy #irrigation #luanc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe