/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/CM-KCR-Health-2-jpg.webp)
CM KCR Health Update: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్(Minister KTR) కీలక అప్‌డేట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్(CM KCR) గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు కేటీఆర్ తెలిపిన విషయ తెలిసిందే. అయితే, గత మూడు వారాల నుంచి ఆయనకు ఇంకా బయటకు రాకపోవడం, ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో సర్వత్రా అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మంత్రి కేటీఆర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఛాతిలో ఇన్‌ఫెక్షన్ ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతిలో ఉన్నారని తెలిపారు. ఛాతిలో సెంకడరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్.. ప్రస్తుతం బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడంతో మరింత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆయన కొలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు కేటీఆర్. ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.
Also Read:
నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు.. నుంచి నామినేషన్లు.. ముఖ్యమైన తేదీలివే!
కాంగ్రెస్ సంచలన హామీ..పెళ్లి సమయంలో ఆడపిల్లలకు తులం బంగారం..!