CM KCR Health Update: సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి కేటీఆర్.. ఆయనకేమైందంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కీలక అప్డేట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉందని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతిలో ఉన్నారని చెప్పారు. ఛాతిలో సెంకడరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న సీఎం కేసీఆర్.. ప్రస్తుతం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడంతో మరింత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆయన కొలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు కేటీఆర్.