CM Revanth Reddy Invitation To KCR: జూన్ 2న తెలంగాణ ఆవిర్భవ దశాబ్ధి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో (Parade Ground) జరగనున్న అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వాన లేఖను రాసిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వాన లేఖను.. స్వయంగా కేసీఆర్‌కు అందించాలని.. ప్రభుత్వ ప్రతినిధులు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్‌కు సూచించారు.
Also Read: ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ.. 2019 ఎన్నికల ఫలితాల అంచనాలు ఇవే!
అయితే తాజాగా కేసీఆర్‌కు ప్రభుత్వ ప్రతినిధి అయిన వేణుగోపాల్ హర్కర ఆహ్వాన లేఖను అందించారు. తెలంగాణ సాధనలో భాగస్వామిగా, విపక్షనేతగా కేసీఆర్‌కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం పలికారు. మరోవైపు అదేరోజున దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ ప్లాన్ వేస్తోంది. అయితే మరీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.