Telangana Politics: ఆశలు వదులుకున్న ముత్తిరెడ్డి.. జనగామలో పల్లాకు లైన్ క్లీయర్?

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే టికెట్ రేసు నుంచి తప్పుకున్నట్లు అర్థం అవుతోంది. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామా టికెట్ విషయంలో లైన్ క్లీయర్ అయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

New Update
Telangana Politics: ఆశలు వదులుకున్న ముత్తిరెడ్డి.. జనగామలో పల్లాకు లైన్ క్లీయర్?

జనగామ ఎమ్మెల్యే టికెట్ పై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) ఆశలు వదులకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం హామీతో ఆయన శాంతించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థులను ఇటీవల ప్రకటించిన సీఎం కేసీఆర్ (CM KCR).. జనగామ స్థానానికి మాత్రం ఎవరి పేరునూ ప్రకటించలేదు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కేసీఆర్ మారుస్తున్నారన్న క్లారిటీ వచ్చేసింది. ఈ టికెట్ కోసం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆయనపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. జనగామను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనకే టికెట్ రాబోతోందని ఆయన అనేక సార్లు ప్రకటిస్తూ వస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!

అయితే.. ఇటీవల ఆయనకు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. ప్రజలతో సంబంధం లేని ఈ పదవిని ముత్తిరెడ్డి స్వీకరించరన్న ప్రచారం జోరుగా సాగింది. చివరి నిమిషం వరకు టికెట్ కోసమే ఆయన ప్రయత్నిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ రోజు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా యాదగిరిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి: CM KCR: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు: డీకే అరుణ సంచలన వాఖ్యలు

publive-image తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

ఎన్నికల కోడ్ వస్తే బాధ్యతలు స్వీకరించడం కుదరదని ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన సూచనలతోనే ముత్తిరెడ్డి టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారని తెలుస్తోంది. ఈ పరిణామంతో ఇప్పటికే నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో పై చేయి సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ కు లైన్ క్లీయర్ అయినట్లు చెప్పొచ్చు. దీంతో ఒకటి లేదా రెండు రోజుల్లోనే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు