నేడు వైఎస్సాఆర్‌ షాదీ తోఫా, కళ్యాణమస్తు నిధుల విడుదల!

ఏపీ ప్రజలకు జగన్‌ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పేద ఇంటి ఆడపిల్లల పెళ్లికి వైఎస్సాఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్సాఆర్‌ షాదీ తోఫా పథకాల కింద మరోసారి లబ్ధిదారులకు అందజేయనుంది.

నేడు వైఎస్సాఆర్‌ షాదీ తోఫా, కళ్యాణమస్తు నిధుల విడుదల!
New Update

CM Jagan Mohan Reddy : ఏపీ ప్రజలకు జగన్‌ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పేద ఇంటి ఆడపిల్లల పెళ్లికి వైఎస్సాఆర్‌ కళ్యాణమస్తు (YSR Kalyanamastu), వైఎస్సాఆర్‌ షాదీ తోఫా (YSR Shaadi Tohfa) పథకాల కింద మరోసారి లబ్ధిదారులకు అందజేయనుంది. నేడు ఈ పథకాలకు సంబంధించిన నిధులను సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

2023 ఏప్రిల్‌- జూన్‌ 2023 త్రైమాసికంలో పెళ్లి చేసుకుని అర్హత కలిగిన 18,883 జంటలకు గానూ ప్రభుత్వం రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని వధువు తల్లి ఖాతాలో జమ చేయనున్నారు.

ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందజేస్తోంది. ఈ పథకానికి అర్హుల కావాలంటే వధూవరులిద్దరూ పదో తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిబంధనను పెట్టింది.

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి.వారి వివాహాన్ని జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు" పథకాన్ని అందిస్తుంది. కచ్చితంగా వధూవరులిద్దరూ కూడా మేజర్లు అయి ఉండాలి. అంటే అమ్మాయి వయసు 18, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

దీని వలన బాల్య వివాహాల నివారణతో పాటు వారు ఇంటర్ వరకు చదివేందుకు అమ్మ ఒడి సాయం (AMMA Vodi) , ఆపై చదువులకు జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya Deevena) ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, భోజన, వసతి ఖర్చులకు సైతం జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధి ఉండడంతో వారు ఉన్నత విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు అవుతారనేది ప్రభుత్వ ఉద్దేశం.

నేడు విడుదల చేస్తున్న సాయంతో కలిపి గడిచిన 9 నెలల్లోనే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద 35,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.267.20 కోట్లు జమ చేసింది జగన్ సర్కారు. దూదేకుల, నూర్ బాషాల విజ్ఞప్తిని మన్నించి వారికి కూడా వైఎస్సార్ షాదీ తోఫాతో సమానంగా లబ్ధి రూ. 1,00,000 కు పెంచిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కళ్యాణము, వైఎస్సార్ షాదీ తోఫాలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం 'జగనన్నకు చెబుదాం' 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు.

Also Read: అడవి బిడ్డల దుస్థితి మారాలి.. ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్

#ycp #ys-jagan #ap-cm-jagan #ap-government #jagananna-vidya-deevena #ap-govt-schemes #ysr-kalyanamasthu #ysr-shadhithofa #ysr-shaadi-tohfa #ap-amma-vodi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe