CM Jagan: ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. అసెంబ్లీలో సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అసెంబ్లీలో తన చివరి స్పీచ్ ను ఇచ్చారు సీఎం జగన్. ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేసిందో వివరణ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. కరోనా వల్ల అనుకున్నవన్నీ పూర్తిగా చేయలేకపోయామని తెలిపారు.

New Update
CM Jagan: ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. అసెంబ్లీలో సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

CM Jagan: సీఎం జగన్ అసెంబ్లీలో ఐదేళ్లు అధికారంలో ఉండి వైసీపీ చేసిన అభివృద్ధి పనుల పై వివరణ ఇచ్చారు. జూన్‌లో కొలువుదీరబోయే వైసీపీ ప్రభుత్వం.. ఇదే సభలో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ సమర్పిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఐదు ప్రజా బడ్జెట్‌లు ప్రవేశపెట్టమని తెలిపారు. ప్రతిపక్షం వేస్తున్న నిందలు.. వాస్తవాలేంటన్నది ప్రజలకు వివరించబోతున్నాం అని పేర్కొన్నారు.

కఠినమైన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం అని అన్నారు. ఈ ఐదు సంవత్సరాల్లో అనూహ్య పరిస్థితులెన్నో చూశాం.. ఎన్నో సవాళ్లు ఎదురుకున్నామని అన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కరోనా లాంటి సంక్షోభం ఎప్పుడూ రాష్ట్రం చవిచూడలేదని అన్నారు. గత ప్రభుత్వ పాలన ప్రభావం కూడా రాష్ట్రంపై కనిపించిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులన్నీ అధిగమించి రాష్ట్ర ప్రజలకు గొప్ప పాలన అందించినట్లు సీఎం జగన్ తెలిపారు.

ALSO READ: ఢిల్లీకి చంద్రబాబు.. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు?

కరోనా కారణంగానే..

కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని అన్నారు సీఎం జగన్. మూడేళ్లలో రాష్ట్రం 66 వేల కోట్లు ఆదాయం నష్టపోయిందని పేర్కొన్నారు. కోవిడ్‌ మహమ్మారి వల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు పెరిగిపోయాయని.. ఈ ఐదేళ్లలో చూసిన అనూహ్య పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాటా (డెవల్యూషన్స్‌) తగ్గిపోవడం ఒకటి.. చంద్రబాబు పాలన కాలంతో పోలిస్తే ఈ ఐదేళ్లలో మన రాష్ట్రంతోపాటు అన్ని రాష్ట్రాలకూ తగ్గాయని అన్నారు. ఈ కష్టాలను కూడా ఎదుర్కొని ఐదేళ్లు పాలన సాగించినట్లు తెలిపారు. కరోనా వల్ల మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు నష్టపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోందని... అయినా సరే.. ఈ ఐదేళ్లలో సుపరిపాలన అందించగలిగాం అని హర్షం వ్యక్తం చేశారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా గత ఐదేళ్లలో..

* 2018 - 19లో 32780 వేల కోట్లు వస్తే
* 2019- 20లో 28000 కోట్లు
* 2020-21 - 24000 కోట్లకు
* 2021-22 - 36 వేల కోట్లు
* 2023-23లో 38 000 కోట్లకు చేరుకుందని జగన్ వెల్లడించారు.

ALSO READ: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టులు పెంపు

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు