CM Jagan : వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు!

వైసీపీ కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీని కాదు అని ఎవరికీ ఓటేసినా వచ్చే పథకాలు అన్ని కూడా ముగిసిపోయినట్లే అని ముఖ్యమంత్రి అన్నారు. వారిని నమ్మితే ప్రజలు మోసపోవడం ఖాయమని అన్నారు.

CM Jagan : వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు!
New Update

YCP Schemes : ఏపీలో ఎన్నికల(AP Elections) ప్రచారంలో చివరి రోజు అయిన శనివారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan) ఏలూరు జిల్లా కైకలూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ భారీ బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ.. మరో 36 గంటల్లో ఏపీలో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుంది. ఈ ఎన్నికలు ఏపీలోని ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం జరిగే ఎన్నికలు కావు.. ఇంటింటి అభివృద్ది, పథకాల కొనసాగింపు కోసం జరుగుతున్న మహా సంగ్రామమని జగన్‌ అన్నారు.

వైసీపీ కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీని కాదు అని ఎవరికీ ఓటేసినా వచ్చే పథకాలు అన్ని కూడా ముగిసిపోయినట్లే అని ముఖ్యమంత్రి అన్నారు. వారిని నమ్మితే ప్రజలు మోసపోవడం ఖాయమని అన్నారు.

ఎప్పుడు అమలు కానీ, సాధ్యం కానీ హామీలు ఇవ్వడమే చంద్రబాబు(Chandrababu) కు అలవాటని ... బాబును నమ్మితే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని జగన్‌ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని అభివృద్దిని వైసీపీ ప్రభుత్వం చేసి చూపించిందని జగన్ అన్నారు. అవినీతికి తావు లేకుండా..లంచం అనే ప్రసక్తి లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందించినట్లు వివరించారు.

తీర్చగలిగే హామీలు మాత్రమే వైసీపీ మేనిఫెస్టోలో పెట్టింది. వైసీపీ ప్రభుత్వం అంటేనే అనేక సంక్షేమ పథకాలు గుర్తు వస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఇళ్ల పట్టాలు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలా అనేక పథకాలు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. ఇంటి వద్దకే పౌర సేవలు అందించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి పేదలకు పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను కక్షగట్టి బాబు ఆపేశాడని.. తనకు మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో చంద్రబాబు పెన్షన్లు అందకుండా చేస్తున్నాడని విమర్శించారు.

ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డ అయిన జగన్‌ కు, ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also read: కాబోయే భర్తలో ఆ క్వాలిటీస్ ఉండాలంటున్న ‘ఆదిపురుష్’ బ్యూటీ!

#ap-ycp #politics #ap-cm-jagan #eluru #kaikaluru
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe