Padma Awards 2024:గణతంత్ర దినోత్సవం 2024 వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ఈ ఏడాది మొత్తం ఐదుగురు ప్రముఖులకు ప్రకటించారు. అందులో మన తెలుగు తేజాలయిన మెగాస్టార్ చిరంజీవికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఈ పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. ఆవార్డ్ ప్రకటన తెలిసిన వెంటనే రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.
వెంకయ్యనాయుడు, చిరంజీవిలకు సీఎం అభినందనలు
మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడుగారికి, సినీనటుడు శ్రీ చిరంజీవి గారికి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన పద్మవిభూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ హర్షం వ్యక్తంచేశారు. వారికి తన అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో పద్మ అవార్డులను దక్కించుకున్న వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.
తెలుగు వెలుగులకు తెలంగాణ శణార్తులు-ఎంపీ బండి సంజయ్ కుమార్
.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పద్మ పురస్కారాలు వరించిన ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి గార్లకు శుభాకాంక్షలు.అట్లాగే తెలంగాణ నుండి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన శ్రీ కూరెళ్ల విఠలాచార్య, శ్రీ గడ్డం సమ్మయ్య, శ్రీ కేతవత్ సోమ్ లాల్, శ్రీ వేలు ఆనంద చారి, శ్రీ దాసరి కొండప్ప గార్లకు సనార్తులు శణార్థులు అంటూ తెలియజేసారు.
ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
పద్మ విభూషణ్ 2024 పురస్కారాలు
వైజయంతీమాల బాలి (తమిళనాడు) - కళలు
కొణిదెల చిరంజీవి (ఆంధ్రప్రదేశ్) - కళలు
ఎం వెంకయ్యనాయుడు (ఆంధ్రప్రదేశ్) - ప్రజా సంబంధాలు
బిందేశ్వర్ పాఠక్ (మరణాంనతరం) (బీహార్) - సామాజిక సేవ
పద్మా సుబ్రమణ్యం (తమిళనాడు) - కళలు
ALSO READ: పద్మ విభూషణులు వెంకయ్య, చిరంజీవి.. ముగ్గురు తెలుగు వారికి పద్మశ్రీ