/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jagan-3-1-jpg.webp)
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఆయన విజయవాడలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మొగల్రాజపురంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ కు ఆయన సోమవారం మధ్యాహ్నం వెళ్లారు.
అక్కడ సీఎంకి ఎంఆర్ఐ స్కానింగ్ తో పాటు వివిధ రకాల రక్త పరీక్షలు కూడా చేసినట్లు సమాచారం. ఈ పరీక్షల కోసం సీఎం సుమారు రెండు గంటల పాటు డయాగ్నోస్టిక్ సెంటర్ లోనే ఉండిపోయారు.
పరీక్షలు అన్ని పూర్తి అయిన తరువాత సీఎం తిరిగి తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సీఎంతో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు.
సోమవారం నాడు విజయవాడలో ముఖ్యమంత్రి ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్రస్థాయి 21 వ సభలు ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది ఉద్యోగులు, ఏపీఎన్జీవో సభ్యులు హాజరయ్యారు.
ఈ సభలకు ముఖ్యమంత్రి జగన్ మొదటి రోజు ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగులందరికీ అనుకూలంగా ఉండేలా జీపీఎస్ ను తీసుకు వచ్చామని పేర్కొన్నారు. యావత్ దేశం మొత్తం ఈ జీపీఎస్ విధానాన్ని అనుసరిస్తుందని పేర్కొన్నారు.
ఒకటి రెండు రోజుల్లో ఈ స్కీమ్‌కు సంబంధించిన ఆర్డినెన్స్ ను జారీ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ప్రసంగం అయిన తరువాత ఆయన వైద్య పరీక్షల కోసం మొగల్రాజుపురంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ కు వెళ్లారు.