CM Chandrababu : పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం అందించండి : చంద్రబాబు AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై నిర్మలకు మెమోరాండం అందించారు. పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. By V.J Reddy 05 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి CM Chandrababu Met Finance Minister : రెండో రోజు ఢిల్లీ (Delhi) పర్యటనలో సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) తో భేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక అవసరాలపై, పరిస్థితిని నిర్మలకు వివరించారు. పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. నిధుల కేటాయింపులు ఎందుకు పెంచాలో వివరిస్తూ మెమోరాండం ఇచ్చారు. పోలవరం (Polavaram), అమరావతి (Amaravati) కి ఆర్థిక సాయం అందించాలని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు సాయం అందించాలని కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని నిర్మలకు వివరించారు. 2023-24లో రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 33.32 శాతానికి చేరుకున్నాయని వెల్లడించారు. 2019-20లో రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 31.02 శాతమే ఉన్నాయని తెలిపారు. పెండింగ్ ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు నిర్మలను కోరారు. Met with the Hon'ble Minister of Finance and Corporate Affairs, @nsitharamanoffc Ji, in Delhi today to discuss welfare and economic development in Andhra Pradesh and to further our collaboration. https://t.co/de5fPueIBr — N Chandrababu Naidu (@ncbn) July 5, 2024 Also Read : బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం.. ఓటమిని అంగీకరించిన సునాక్ #delhi #cm-chandrababu #nirmala-sitharaman #finance-minister మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి