Ramoji Rao: అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం: చంద్రబాబు రాజధానిగా ఒక పేరును రీసెర్చ్ చేసి 'అమరావతి' అని చెప్పి నాకు చెప్పిన వ్యక్తి రామోజీరావు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో మాట్లాడుతూ.. రామోజీరావు పేరు మీద అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. By B Aravind 27 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహిత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసింది. ఈ సభకు రాజకీయ, సినీ ప్రముఖులు, పలువురు పాత్రికేయులు హాజరయ్యారు. విజయవాడ శివారులోని కానూరులో ఏర్పాటు చేసిన ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు హజరై.. రామోజీరావుకు పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులు ఏపీ రాజధాని అమరాతి అభివృద్ధి కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ' ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి గొప్ప శక్తిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి రామోజీరావు. ఓకే ఒక్క ఎన్టీఆర్ ఓకే ఒక్క రామోజీరావు ఉంటారు. ఇది ఎప్పటికీ అలాగే ఉంటుంది. రామోజీరావు ఏ రంగం తీసుకున్నా ఆయనకు ఆయనే సాటి. ఆయన చేసిన సామజసేవకు అనేక అవార్డులు వచ్చాయి. Also Read: నీట్ పేపర్ లీక్.. ఇద్దరు అరెస్టు వినూత్నమైన ఆలోచనలతో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు. హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఏదైనా ఒక విపత్తు వచ్చినపుడు సేవాభావంతో పని చేసి అనేక సేవలందించారు. నేను ఆయన్ని 40 ఏళ్ల నుంచి దగ్గరగా చూస్తున్నాను. భయమనేది ఆయనకు తెలియదు. పోరాటమే ఆయనకు స్ఫూర్తి. తెలుగుజాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి రామోజీరావు. విలువల కోసం జీవితాంతం బ్రతికిన వ్యక్తి ఆయన. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ప్రముఖ పాత్ర ఉన్న వారిలో రామోజీరావు ఒకరు. రాజధానిగా ఒక పేరును రీసెర్చ్ చేసి 'అమరావతి' అని చెప్పి నాకు చెప్పిన వ్యక్తి రామోజీరావు. తెలుగుజాతికి రామోజీ రావు గారు చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాలి. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత. రామోజీరావు ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలి. ఎన్టీఆర్, రామారావు ఇద్దరూ యుగపురుషులు. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు… pic.twitter.com/b9NJZgVGTX — Telugu Desam Party (@JaiTDP) June 27, 2024 ఐదేళ్లు అమరావతి ఇబ్బంది పడింది. మళ్ళీ అమరావతి పూర్వవైభవం సంతరించుకుటుంది. "నేను పనిచేస్తూ పని చేస్తూ చనిపోవాలి" అని అన్న ఆయన కోరిక ప్రకారమే చివరి రోజుల్లో జరిగింది. రామోజీ రావు స్ఫూర్తిని అందరికీ అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలుగుజాతికి ఆయన చేసి సేవలు కోసం రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి. ఎన్టీఆర్, రామోజీరావులకు ఖచ్చితంగా భారతరత్న ఇవ్వడం కోసం మనం పోరాడాలి. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం, ఢిల్లీలో రామోజీ విజ్ఞాన భవన్ లను ఏర్పాటు చేస్తాము. ఒక రోడ్డుకు కూడా ఆయన పేరు పెడతాం. వైజాగ్ రామోజీ చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమాలు షూటింగ్ చేసుకునేలా చేస్తామని' చంద్రబాబు అన్నారు. Also read: చంద్రబాబు ముందు పెను సవాళ్లు! #pawan-kalyan #telugu-news #tdp #cm-chandra-babu #ramoji-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి