ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు.. వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ' రిషికొండలో రూ.500 కోట్లతో భవనాలు కడతావా? ప్రజాధనాన్ని నీ విలాసం కోసం వినియోగిస్తావా ?. 2019 లో 151 సీట్లతో గెలిపిస్తే ప్రజలకు నమ్మక ద్రోహం చేశావు. దిక్కు తోచని స్థితిలో ప్రజలు ఎన్‌డీఏకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. తెలంగాణలో కూడా ప్రభుత్వం మారింది. కానీ తెలంగాణను పాలించిన వ్యక్తులు ఇంత అరాచకం చేయలేదు. తెలంగాణలో ఇంత అవినీతి జరిగినట్లు నాకు అనిపించలేదు. ప్రభుత్వ కష్టాలు, జరిగిన విధ్వంసం గురించి ప్రజలకు తెలియాలనే శ్వేతపత్రాలు ప్రవేశ పెట్టాం.
Also read: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి..
వినుకొండలో హంతకుడుది ఏ పార్టీ? హతుడిది ఏ పార్టీ?. మొన్నటి వరకు మీ పార్టీలో లేరా?. 36 మందిని చంపారంటున్నావ్.. వాళ్ళ పేర్లేంటి?. నిజాయతీ ఉంటే పేర్లు ఇవ్వు. నువ్వు చంపిన వాళ్ళ పేర్లు కూడా నేను ఇచ్చా. ఆ కేసులు రీఓపెన్ చేస్తా. సిద్ధమా?. హూ కిల్డ్ బాబాయ్ ?. బాబాయ్ హంతకులను పట్టుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది?. వడ్డీతో సహా చెల్లిస్తా. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు. రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు.
నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తా. ప్రతీ పల్లెలో చర్చ పెడదాం. మదనపల్లెలో సబ్ కలెక్టరేట్ ఆఫీస్‌ను తగలబెడితే విచారణ చేయించడం తప్పా ?. 0కరుడు గట్టిన నేరస్థులు చేసే పనులు ఇవే. ముచ్చుమర్రిలో బాలికను రేప్ చేసి హత్య చేస్తే అరెస్టు చేశాం. దానిపై యాక్షన్ తీసుకోలేదని అబద్ధాలు చెబుతున్నారు. ఆ కేసులో ఒకతను భయపడి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అయినా ఎవ్వరినీ వదల్లేదని' చంద్రబాబు అన్నారు.
Also Read: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వారికి రూ.3 వేలు