/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T122419.382.jpg)
CM Chandrababu Naidu : గతంలో సీఎం చంద్రబాబు సతీమణి గురించి వైసీపీ (YCP) నేతలు అసెంబ్లీ (Assembly) లో ప్రస్తావించడంతో ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయి మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ సంఘటనను సీఎం చంద్రబాబు (CM Chandrababu) అసెంబ్లీ సమావేశాల్లో గుర్తుచేశారు. గతంలో నాపై బాంబు దాడి జరిగినా కూడా కన్నీళ్లు పెట్టుకోలేదని.. కానీ రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను వైసీపీ నేతలు అవమానించారని అన్నారు. తన సతీమణినే కాకుండా రాష్ట్రంలో ఆడబిడ్డలందరిని కించపరిచేలా వాళ్లు మాట్లాడరని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. ఆడబిడ్డల గురించి అలా మాట్లాడినందుకే విని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.