దసరా కానుకగా తెలంగాణ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు అల్పాహార పథకం అందించనుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రారంభించారు. బ్రేక్ ఫాస్ట్ మెనూ కూడా ఖరారు అయిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్‌లో ఈ పథకాన్ని నేడు 8:45 గంటలకు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందివ్వనున్నారు.
బ్రేక్ ఫాస్ట్ మెనూ...
సోమవారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం – పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ
బుధవారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ
గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం – పొంగల్/సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ
ప్రైమరీ స్కూళ్ళల్లో ఉదయం 8:45 గంటల నుంచి అల్పాహారాన్ని అందిస్తారు. దాని తర్వాత 9.35 గంటలకు ప్రార్ధనా సమయం ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని స్కూళ్ళల్లో బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ ఉదయం 8 గంటలకు మొదలవుతుంది.ఇక అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ స్కూల్స్ వారికి బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ ఉదయం 8:45 గంటల నుంచి మొదలవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్ధులకు మంచి ఆహారాన్ని అందిచడంతో పాటూ డ్రాప్ అవుట్స్ ను పెంచడానికి...చదువు మీద శ్రద్ధ కలిగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఈ పథకం తీరును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమీషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించామని తెలిపారు. దసరా సెలవుల తర్వాత నుంచి అల్పాహార పథకం పూర్తిగా అమలులోకి వస్తుందని చెప్పారు.