cm breakfast scheme: ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించాలనే ఉద్దేశంతో మొదలు పెడుతున్న పథకాన్ని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్‌లో శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 స్కూళ్ళల్లో 23 లక్షల మంది విద్యార్ధులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. స్కూళ్ళు స్టార్ అవ్వడానికి 45 నిమిషాల ముందు బ్రేక్ ఫాస్ట్ ఇవ్వనున్నారు. By Manogna alamuru 06 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి దసరా కానుకగా తెలంగాణ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు అల్పాహార పథకం అందించనుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రారంభించారు. బ్రేక్ ఫాస్ట్ మెనూ కూడా ఖరారు అయిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్‌లో ఈ పథకాన్ని నేడు 8:45 గంటలకు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందివ్వనున్నారు. బ్రేక్ ఫాస్ట్ మెనూ... సోమవారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ మంగళవారం – పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ బుధవారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్ శుక్రవారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ శనివారం – పొంగల్/సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ ప్రైమరీ స్కూళ్ళల్లో ఉదయం 8:45 గంటల నుంచి అల్పాహారాన్ని అందిస్తారు. దాని తర్వాత 9.35 గంటలకు ప్రార్ధనా సమయం ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని స్కూళ్ళల్లో బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ ఉదయం 8 గంటలకు మొదలవుతుంది.ఇక అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ స్కూల్స్ వారికి బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్ ఉదయం 8:45 గంటల నుంచి మొదలవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్ధులకు మంచి ఆహారాన్ని అందిచడంతో పాటూ డ్రాప్ అవుట్స్ ను పెంచడానికి...చదువు మీద శ్రద్ధ కలిగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఈ పథకం తీరును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమీషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించామని తెలిపారు. దసరా సెలవుల తర్వాత నుంచి అల్పాహార పథకం పూర్తిగా అమలులోకి వస్తుందని చెప్పారు. #kcr #telangana #schools #cm #sheme #breackfast మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి