Cloud Burst: అక్కడ మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌..కొట్టుకుపోయిన రోడ్లు!

హిమాచల్‌ ప్రదేశ్‌ ను ఆకస్మిక వరదలు మరోసారి ముంచెత్తాయి.శుక్రవారంఅర్థరాత్రి క్లౌడ్‌ బరస్ట్‌ అవ్వడంతో కుండపోత వాన పడింది. దీంతో చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఆగస్టు 22 వరకు వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.

author-image
By Bhavana
Cloud Burst:  అక్కడ మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌..కొట్టుకుపోయిన రోడ్లు!
New Update

Cloud Burst: హిమాచల్‌ ప్రదేశ్‌ ను ఆకస్మిక వరదలు మరోసారి ముంచెత్తాయి. శుక్రవారం అర్థరాత్రి సిమ్లా జిల్లాలోని రాంపూర్‌ సబ్‌డివిజన్‌లో గల తక్లోచ్‌ ప్రాంతంలో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కుండపోత వాన కురిసింది. దీంతో చాలా వరకు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.

క్లౌడ్‌ బరస్ట్‌ గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ అనుపమ్‌ కశ్యప్‌ పేర్కొన్నారు.ఈ వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 58 రహదారులను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అందులో సిమ్లాలో 19 రోడ్లు, మండిలో 14, కాంగ్రాలో 12, ​కులులో ఎనిమిది, కిన్నౌర్‌లో మూడు, సిర్మౌర్, లాహౌల్ స్పితి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రహదారులను మూసివేసినట్లు తెలిపారు. ఇక ఈ వర్షం కారణంగా 31 విద్యుత్, నాలుగు నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆగస్టు 22 వరకు వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఈ కారణంగా ఆగస్టు 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు మొత్తం 12 జిల్లాల్లోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Also Read: వివాదంలో బజరంగ్ పూనియా.. జాతీయ జెండాను అగౌరవపరిచాడంటూ విమర్శలు

#heavy-rains #himachal-pradesh #roads #cloudburst
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe