Telangana: గన్‌ మిస్‌ఫైర్‌.. ఏపీకి చెందిన జవాను మృతి

సంగారెడ్డి జిల్లా బీడీఎల్‌ భానూరులో ఏపీకి చెందిన వెంకటేష్ (34) అనే సీఐఎస్‌ఎఫ్ జవాను మృతి చెందారు. బెటాలియన్‌ బస్సులో నుంచి కిందకి దిగుతుండగా.. ఆయన గన్‌ మిస్‌ ఫైర్ అయ్యింది. దీంతో తుపాకీ పేలి తూటా వెంకటేష్ తలలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు.

New Update
Telangana: గన్‌ మిస్‌ఫైర్‌.. ఏపీకి చెందిన జవాను మృతి

సంగారెడ్డి జిల్లా బీడీఎల్‌ భానూరులో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటేష్ (34) అనే సీఐఎస్‌ఎఫ్ జవాను మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బెటాలియన్‌ బస్సులో నుంచి కిందకి దిగుతుండగా.. జవాన్ వెంకటేష్ వద్ద ఉన్న గన్‌ మిస్‌ ఫైర్ అయ్యింది. దీంతో తుపాకీ పేలి తూటా ఆయన తలలోకి దూసుకెల్లింది. ఈ ఘటనలో వెంకటేష్‌ అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read: హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. పోలీసులకు భారీగా దొరికిన గంజాయి

వెంకటేష్ స్వస్థలం నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామం. హైదరాబాద్‌లోని సీఐఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు. 13 ఏళ్ల క్రితం ఆయన ఉద్యోగంలో చేరారు. వెంకటేష్‌ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also read: రేషన్‌ కార్డు లేనివారికి గుడ్‌న్యూస్‌..

Advertisment
తాజా కథనాలు