Harsha Sai : హర్షసాయిపై రేప్ కేసు.. అసలు విషయం చెప్పిన లాయర్!

హర్షసాయిపై నమోదైన రేప్ కేసుపై అతని లాయర్ RTVతో కీలక విషయాలు చెప్పారు. హర్షసాయి సక్సెస్‌ను చూడలేకే అక్రమ కేసు పెట్టారన్నారు. ప్రేమ లేదు, పెళ్లి లేదని.. ఇందంతా ఫేక్ కేసు అని అన్నారు. త్వరలో అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు.

New Update
HARSHA

Harsha Sai:యూట్యూబర్‌ హర్షసాయి లాయర్‌ చిరంజీవితో ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్‌ గా మాట్లాడింది. హర్షసాయి సక్సెస్‌ను చూడలేకే అక్రమ కేసు పెట్టారని లాయర్ చెప్పారు. ప్రేమ లేదు, పెళ్లి లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి చూడలేకే తన క్లయింట్ హర్షసాయిపై నిందలు వేస్తున్నారని అన్నారు. రెండేళ్ల క్రితం హర్ష సాయిని ఆ అమ్మాయి కలిసిందని చెప్పారు.  సాంగ్‌లో నటించాలని కోరిందని.. దానికి హర్ష నిరాకరించినట్లు తెలిపారు.

ఏడాదిన్నరగా హర్షకి బాధితురాలికి సంబంధాలు లేవు అని క్లారిటీ ఇచ్చారు. హర్షని, తండ్రి రాధాకృష్ణని బ్లాక్‌మెయిల్‌ చేయడానికే తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని అన్నారు. మెగా లోడర్ ప్రీరిలీజ్‌ సక్సెస్‌ అయిందని... ఇది తట్టుకోలేక హర్ష సాయిపై కేసు నమోదు చేశారని హర్షసాయి లాయర్ ఆర్టీవీతో చెప్పారు.

ఆరోపణల పై స్పందించిన హర్ష సాయి..

అయితే తాజాగా యూట్యూబర్ హర్ష సాయి తనపై చేసిన ఆరోపణలపై స్పంచించాడు. కేవలం డబ్బు కోసమే  తనపై ఆరోపణలు చేస్తున్నారని. త్వరలోనే అసలు నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. తానేంటో తన ఫాలోవర్లకు తెలుసని.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతని లాయర్ తనికొండ చిరంజీవి వెల్లడిస్తారని ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. 

Also Read :  మోహన్ బాబు ఇంట్లో చోరీ

Advertisment
తాజా కథనాలు