/rtv/media/media_files/v75xXcmqhpQQ4smMLMEE.jpg)
Mohan Babu: నటుడు మోహన్ బాబు ఇంట్లో పని చేసే వ్యక్తి షాక్ ఇచ్చాడు. ఆయన ఇంట్లో దొంగతనం చేశాడు. నాయక్ అనే వ్యక్తి గత కొంత కాలంగా హైదరాబాద్ శివారులో జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్నాడు. కాగా నిన్న రాత్రి దాదాపు రూ.10 లక్షల నగదుతో పరారయ్యాడు నాయక్. ఇది గమనించిన మోహన్ బాబు వెంటనే రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 10 గంటల్లోనే నిందితుడి ఆచూకీని కనుక్కున్నారు. నాయక్ తిరుపతిలో ఉన్నాడని గుర్తించిన పోలీసులు..అతడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
Also Read : రేప్ కేసు విషయంలో ఏం జరిగిందో చెప్పిన హర్ష సాయి.. ఇన్స్టా పోస్ట్ వైరల్..!