Yemi Maya Premalona: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్.. వీడియో చూశారా?

అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో అనిల్ ఇనుమడుగు హీరోగా వేణి రావ్ హీరోయిన్‌గా తెరకెక్కిన ' ఏమి మాయ ప్రేమలోన' మ్యూజిక్ ఆల్బమ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ పాటకు 1 మిలియన్ వ్యూస్ రావడంతో పాటు యూట్యూబ్‌లో ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది.

New Update
Yemi Maya Premalona

Yemi Maya Premalona

అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో అనిల్ ఇనుమడుగు (Anil Inamadugu) హీరోగా వేణి రావ్ (Veni Rao) హీరోయిన్‌గా తెరకెక్కిన ' ఏమి మాయ ప్రేమలోన' మ్యూజిక్ ఆల్బమ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. పాట రిలీజ్ అయిన కొన్ని రోజులకే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పాటకు 1 మిలియన్ వ్యూస్ రావడంతో పాటు యూట్యూబ్‌లో ప్రజెంట్ ట్రెండింగ్ అవుతోంది. అయితే ఇందులో లీడ్ రోల్‌లో నటించిన అనిల్ ఇనుమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించారు. అలాగే ఈ పాటను కూడా అతనే డైరెక్టరేట్ చేశారు. అయితే మార్క్ ప్రశాంత్ సంగీతం అందించిన 'ఏమి మాయ ప్రేమలోన' సాంగ్‌ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు. అయితే ఈ పాట లిరిక్స్ అయితే అదిరిపోయాయి. ఈ లిరిక్స్ విన్న ప్రేక్షకులు బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Bigg Boss 9 Telugu: నామినేషన్స్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న రీతూ, మాధురి.. హౌస్‌లో రచ్చే రచ్చ!

ఇది కూడా చూడండి: Jigris Movie release date: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘జిగ్రీస్’ మూవీ డేట్ ఫిక్స్.. దోస్త్‌లతో చూస్తే ఆ  మజానే వేరప్పా!

టూరిస్ట్ గైడ్‌గా..

కేరళలో టూరిస్ట్ గైడ్‌గా ఉండే ఓ అనాథ కుర్రాడి జీవితంలో ఓ మేఘాలు కమ్ముకున్న రోజు ఓ అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఈ మేఘాల మధ్యన దాగిన మెరుపులా ఆ కుర్రాడికి తారాసపడిన ఆ అమ్మాయి ప్రేమని గెలుచుకునే ఓ సున్నితమైన కథాంశం నేపధ్యంలో తెరకెక్కింది. దసరా కానుకగా యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఏమి మాయ ప్రేమాలోన సాంగ్ తాజాగా 1 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. కాన్సెప్ట్‌తో పాటు డైరెక్షన్ కూడా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సూపర్బ్‌గా ఉందని చెప్పాలి. కేరళలోని లొకేషన్స్‌ను చూడముచ్చటగా సినిమాటోగ్రాఫర్ శ్రవణ్ చూపించాడు. ప్రతీ ఫ్రేమ్‌ను కూడా రిచ్‌గా చూపించాడు. లీడ్ రోల్స్ చేసిన అనిల్, వేణి రావ్ జోడి బాగుంది. స్క్రీన్ మీదా ఇద్దరు సహజంగా నటించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పది నిమిషాల నిడివి కలిగిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్‌ను అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో యంగ్ నిర్మాతలు అజయ్, విష్ణు నిర్మించారు. మరి ఇంతటి అద్భుతమైన సాంగ్‌ను ఓసారి మీరు చూసేయండి.