/rtv/media/media_files/2025/10/13/andhra-king-2025-10-13-08-33-46.jpg)
Andhra King
Andhra King: యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “ఆంధ్ర కింగ్ తలూకా” ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఉన్న అంశాలు, పాత్రల పరిచయాలు, కథన శైలి ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.
ఈ సినిమాలో కథ ప్రధానంగా ఒక అభిమానికి, అతని అభిమాన హీరోతో ఉండే భావోద్వేగ సంబంధం మీద ఆధారపడింది. ఒక అభిమాని తన అభిమాన హీరో కోసం జీవితం కూడా త్యాగం చేయగలడు, కానీ ఆ హీరో మాత్రం అతని భావోద్వేగాలను పట్టించుకోడు - ఇదే అసలు లైన్.
Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్
ఆంధ్ర కింగ్ పాత్రకు తెలుగు హీరో ఎందుకు వద్దన్నారు?
ఈ సినిమాలో ఆంధ్ర కింగ్ అనే కీలక పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర కనిపించనున్నారు. అయితే చాలా మందిలో ఒక సందేహం కలుగుతుంది "ఇంత స్ట్రాంగ్ పాత్ర కోసం తెలుగు హీరోని ఎందుకు తీసుకోలేదు?" అనే ప్రశ్న.
Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!
ఇది సాధారణమైన పాత్ర కాదు. ఆంధ్ర కింగ్ పాత్రకు గ్రే షేడ్స్ ఉన్నాయి, అంటే కొంత నెగటివ్ టచ్ ఉంటుంది. పాత్ర ఓ స్టార్ హీరో జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది, కానీ అతను ఎంతో స్వార్థంగా, అభిమాని పట్ల నిష్ఠురంగా ఉండేలా చూపించనున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్స్ తమ ఇమేజ్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ తరహా పాత్రలు వారి ఫ్యాన్ బేస్‌ను తప్పుదోవ పట్టించవచ్చన్న భయం ఉంటుంది. అందుకే, మేకర్స్ తెలుగులో నుంచి ఒక స్టార్‌ని ఎంచుకోలేదు.
Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్ర కింగ్ గా రజినీకాంత్..
ముందుగా వచ్చిన టాక్ ప్రకారం.. ఈ పాత్ర కోసం సూపర్‌స్టార్ రజినీకాంత్ ను సంప్రదించారని. కథ నచ్చినా, పాత్ర నెగటివ్ గా ఉండటంతో ఆయన చివరకు చేయలేదట. టీజర్ చూశాక ఇది నిజమే అనిపిస్తోంది.
ఉపేంద్ర తన కెరీర్ ప్రారంభం నుంచే వైవిధ్యమైన పాత్రలు చేసిన నటుడు. నెగటివ్, పాజిటివ్, గ్రే షేడ్స్ అన్నిటినీ ప్రేక్షకులు అతనిలో అంగీకరించారు. అలాంటి నటుడే ఇలాంటి పాత్రకు సరైన ఎంపిక అని మూవీ టీం భావించారు.
Also Read : కాకరేపుతున్న 'కట్టలన్' ఫస్ట్ లుక్ .. రక్తంతో పోస్టర్ వైరల్!
తెలుగు హీరోలలో కూడా ఈ స్థాయిలో నటించగల వారు ఉన్నా, పాత్ర నెగటివ్ గా ఉండటం వల్ల రిస్క్ తీసుకోవడం ఇష్టపడలేదు. అందుకే మేకర్స్ ఉపేంద్రను తీసుకున్నారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు P దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు.
“ఆంధ్ర కింగ్ తలూకా” సినిమా కథ కొత్తగా ఉంది. అభిమానాన్ని, హీరోల భవిష్యత్తును ప్రశ్నించేలా ఉండబోతుంది. ఉపేంద్ర నటనతో ఈ పాత్రకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. టీజర్ చూస్తేనే ఇంట్రెస్ట్ పెరుగుతోంది, ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి!