OG Trailer : కళ్లతోనే చంపేస్తుంది.. ఓజీ ట్రైలర్లో ఎవరీ బ్యూటీ?

ట్రైలర్ లో చాలా ఉన్నప్పటికీ ఓ అమ్మాయి కూడా బాగా అట్రాక్ట్ చేసింది. సీనియర్‌ నటి శ్రియా రెడ్డి పక్కన పెద్ద పెద్ద లుక్ తో కట్టిపడేసింది. దీంతో ఎవరీ అమ్మాయినే చర్చ నెట్టింట బాగా నడుస్తోంది. నెటిజన్లు చెబుతున్న ప్రకారం

New Update
og Trailer

ఇప్పుడంతా ఓజీ మేనియానే నడుస్తో్ంది. చాలా రోజుల తరువాత పవన్ కల్యాణ్ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయిందంటే అది ఓజీనే. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2025 సెప్టె్ంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తరువాత ఈ సినిమాపైనే చాలా అంచనాలు ఉన్నాయని అంటున్నారు ఫ్యాన్స్.అటు పవన్ కూడా ఖుషి తరువాత ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారని ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. 

ఇక మూవీ ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఓజీ ట్రైలర్ రిలీజ్ చేశారు.  పవన్‌ కల్యాణ్‌ స్టైలిష్‌ లుక్స్‌, థమన్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఫ్లస్ అని చెప్పాలి. ఈ సినిమాలో పవన్‌ గ్యాంగ్‌స్టర్‌ ఓజాస్‌ గంభీరగా నటిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌ పాత్ర పోషించారు. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌ గా నటించింది. ముంబై బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందించారు. ప్రతీ షాట్ కూడా టెక్నికల్ గా చాలా రిచ్ గా డిజైన్ చేశాడు సుజీత్. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఉన్నవి తక్కువే అయినప్పటికీ స్ర్కీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. 

Also read :  Shocking News: ప్రాణం తీసిన అనుమానం.. భార్యను కూతురు ముందే పొడిచి పొడిచి.. ఆ భర్త ఎలా చంపాడంటే..?

ట్రైలర్ లో చాలా ఉన్నప్పటికీ ఓ అమ్మాయి కూడా బాగా అట్రాక్ట్ చేసింది. సీనియర్‌ నటి శ్రియా రెడ్డి పక్కన నల్ల చీరలో పెద్ద పెద్ద  కళ్లతో  కట్టిపడేసింది. దీంతో ఎవరీ అమ్మాయినే చర్చ నెట్టింట బాగా నడుస్తోంది. ఈ అమ్మాయి ఎవరో కాదు బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు. మొన్నటివరకు పెద్దగా ఎవరికీ తెలియని ఈ బ్యూటీ బిగ్‌బాస్‌కి వెళ్లిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ దగ్గరైపోయింది. శుభశ్రీ రాయగురు ముందుగా2022లో రుద్రవీణ అనే తెలుగు సినిమాలో నటించారు, డెవిల్'అనే తమిళ సినిమాతో నటిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత అమిగోస్, కథ వెనుక కథ వంటి చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ఏకంగా పవన్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. ఇందులో ఆమె రోల్ చాలా బాగుంటుందని నెగిటివ్ రోల్ అని సమాచారం. ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా శుభశ్రీ  వెల్లడించింది. మరి చూడాలి ఈ సినిమా ఈ అమ్ముడుకు ఎలాంటి క్రేజ్ తీసుకు వస్తుందో... 

Also Read : H1 బీ ఫీజు పెరిగినా ఏం ప్లాబ్రం లేదు.. అమెరికా ఇలా కూడా వెళ్లొచ్చు..

Advertisment
తాజా కథనాలు