Vishwambhara 1st Song: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న 'విశ్వంభర' సినిమా నుంచి తొలి సింగిల్ ‘రామ రామ’ ప్రోమో విడుదలైంది. హనుమాన్ భక్తి, పవిత్రతతో కూడిన ఈ పాటకు కీరవాణి సంగీతం అందించారు.

author-image
By Lok Prakash
New Update
Vishwambhara 1st Song

Vishwambhara 1st Song

Vishwambhara 1st Song: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ హైప్‌డ్ మూవీ ‘విష్వంభర' ప్రమోషన్స్‌కు గ్రాండ్‌గా శ్రీకారం చుట్టింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సందర్భంగా మ్యూజికల్ ఫెస్ట్‌ను మొదలుపెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఫస్ట్ సింగిల్ ‘రామరామా’ ప్రోమోను విడుదల చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర నుంచి లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

Also Read: మహేష్ బాబుతో శవాల ముందు డ్యాన్స్ వేయిస్తా..!

రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు..

శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ పాటకు, శోభి మాస్టర్ – లలిత మాస్టర్స్ కోరియోగ్రఫీ అందించగా, రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిరంజీవి చిన్నారులతో కలిసి కనిపించే సన్నివేశాలు, ఆయన ఎనర్జీ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 80, 90ల కాలంలో చిరు చూపించిన స్టైల్, ఫైర్ ఈ పాటలో మళ్లీ కనిపించడం హైలైట్.
 
దర్శకుడు వశిష్ఠ 'విష్వంభర' ద్వారా మరొకసారి తన క్రియేటివ్ విజన్‌ను చూపించనున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన గత చిత్రం ‘బింబిసార’ ద్వారా సృష్టించిన మైథికల్ యూనివర్స్, ఇప్పుడు ఈ సినిమాలో మరింత విస్తృతంగా ఉండనుందనే భావన ప్రోమో చూసినవారిలో ఏర్పడుతోంది.

Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!

విశ్వంభర సినిమా మేకింగ్‌లో ఉన్న గ్రాండ్‌నెస్, చిరంజీవి లుక్‌, కీరవాణి మ్యూజిక్ అన్నీ కలిసి ఈ ప్రాజెక్టును చిరు కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రామరామా’ పూర్తి పాట విడుదలతో సినిమాపై మరింత హైప్ నెలకొల్పేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

ఈ పాటతో ‘విష్వంభర’ మ్యూజిక్  ప్రయాణం శుభారంభం కానుంది. మిగిలిన పాటలపై కూడా ఆసక్తి పెరిగేలా ఈ ట్రాక్ దూసుకెళ్తోంది. ఇక కీరవాణి మ్యాజిక్ రానున్న రోజుల్లో ఎలాంటి హంగామా చేస్తుందో చూడాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు