Kalki 2: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

‘కల్కి 2898 AD’తో ఘన విజయం సాధించిన నాగ్ అశ్విన్, తన తదుపరి చిత్రాన్ని అలియా భట్‌తో తెరకెక్కించనున్నాడు. ప్రభాస్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో మధ్యలో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట నాగ్ అశ్విన్.

New Update
Kalki 2

Kalki 2

Kalki 2: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నాగ్ అశ్విన్ లాస్ట్ ఇయర్ ప్రభాస్ తో కల్కి 2898 AD మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక రెండో భాగం కల్కి 2 షూటింగ్ ఈ సంవత్సరం పట్టాలెక్కాల్సింది. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ డేట్స్ సెట్  కాకపోవడం వల్ల కల్కి సీక్వెల్ షూటింగ్ ఈ ఏడాది ప్రారంభం అయ్యేలాగా కనబడడం లేదు. నిజానికి ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. డార్లింగ్ లైన్ అప్ చుస్తే మైండ్ పోవాల్సిందే,  మారుతీ డైరెక్షన్లో రాజా సాబ్, హను రాఘవపూడి తో ఫౌజీ, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ ఇలా అన్ని బడా మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు.

Also Read: మహేష్ బాబుతో శవాల ముందు డ్యాన్స్ వేయిస్తా..!

Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!

అలియా భట్ ప్రధాన పాత్రలో

ఇది అంతా చూస్తుంటే వచ్చే ఏడాదికిగాని నాగ్ అశ్విన్ కి డార్లింగ్ డేట్స్ దొరికేలాగ లేవు, ఇక చేసేదేమి లేక నాగ్ అశ్విన్ ఈ గ్యాప్ లో మరో కొత్త సినిమాను తెరకెక్కించనున్నాడు. అలియా భట్ ప్రధాన పాత్రలో నాగ్ ఓ కొత్త సినిమాను రూపొందిస్తున్నాడని సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ తాలుకు ప్రీ- ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారట. ఈ ఇయర్ లోనే మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రానుంది. అయితే ఈ మూవీని లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కిస్తున్నాడట నాగ్ అశ్విన్. కల్కి తరహాలోనే ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు. మరి ఈ మూవీ ని పూర్తి చేసి కల్కి సీక్వెల్ ని నాగ్ అశ్విన్  ఎప్పటికి పట్టాలెక్కిస్తాడో వేచి చూడాలి.

Also Read: ‘సోదరా’ ట్రైలర్‌ చూశారా..? సంపూ రచ్చ మాములుగా లేదుగా!

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?


   

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు