/rtv/media/media_files/2025/07/29/director-vasishta-reacy-on-copying-avatar-film-and-making-vishwambhara-movie-2025-07-29-13-07-10.jpg)
Vishwambara teaser trolled by netizens director Vasishta react
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ అడ్వెంచరస్‌గా ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేం డైరెక్టర్ మల్లిడి వశిష్ట ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో సీనియర్ నటి త్రిష, యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదే సమయంలో కునాల్ కపూర్, జాన్వీ కపూర్, ఇషా చావ్లా, సురభి వంటి అందాల ముద్దుగుమ్మలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: మెగా కోడలిగా తొలి సినిమా.. 'సతీ లీలావతి' టీజర్ అదిరింది!
Vishwambara teaser trolled
మరో విశేషం ఏంటంటే.. ఇందులో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి.వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఒక స్పెషల్ సాంగ్‌కు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
ఈ సినిమా దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అందులో రూ.75 కోట్లు వీఎఫ్ఎక్స్ కోసమే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అది కాస్త వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు జాప్యం కారణంగా ఈ విడుదల తేదీ వాయిదా పడింది.
Also Read: 34 ఏళ్ళ తర్వాత ఆ స్పెషల్ వ్యక్తిని కలిసిన పవన్ .. ఫొటోలు వైరల్!
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నా హాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కాగా.. మేకర్స్ వీఎఫ్ఎక్స్ వర్క్‌పై ఫుల్‌గా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్‌పై వచ్చిన ట్రోల్స్‌పై దర్శకుడు మల్లిడి వశిష్ట రియాక్ట్ అయ్యారు.
ఇటీవల ‘విశ్వంభర’ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్‌పై భారీ స్థాయిలో ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. ఈ టీజర్ అచ్చం అవతార్ మూవీ వలే ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై దర్శకుడు స్పందించాడు. ఈ మేరకు వశిష్ట మాట్లాడుతూ.. ‘‘విశ్వంభర టీజర్ నాకు బాగా నచ్చింది కాబట్టే నేను విడుదల చేశాను. టీజర్‌లో కనిపించిన పాప కాస్ట్యూమ్‌ను చూసి చాలా మంది అవతార్ మూవీ కాపీ చేశారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇందులో చూపించిన కొండలు, పాప చెవులు.. ఇతర గ్రాఫిక్స్ చూసి అలా భావించారు. కానీ కొండలు, చెవులు పెద్దగా ఉండటం ‘అవతార్’ కంటే ముందు ఎన్నో సినిమాల్లో చూపించారు. నేను కేవలం చందమామ కథలు చూసి స్ఫూర్తి పొందాను. వాటి ఆధారంగానే కాస్ట్యూమ్ డిజైన్ చేయించాను. ఇందులో 5గురు హీరోయిన్లు ఉన్నారంటూ బయట ప్రచారం జరుగుతోంది. ఇందులో ఇద్దరే హీరోయిన్లు. మెయిన్ హీరోయిన్ త్రిష, సెకండ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్. మిగతావారు కీలక పాత్రల్లో కనిపిస్తారు. వీఎఫ్ఎక్స్ జాప్యం వల్లనే ఈ సినిమా వాయిదా పడుతుంది.’’ అని తెలిపారు.