Sathi Leelavathi Teaser: మెగా కోడలిగా తొలి సినిమా.. 'సతీ లీలావతి' టీజర్ అదిరింది!

లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించిన 'సతీ లీలావతి' మూవీ టీజర్ విడుదల చేశారు.  భార్య భర్తలుగా లావణ్య, దేవ్ మోహన్ మధ్య సన్నివేశాలు అలరించాయి. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.

New Update

Sathi Leelavathi Teaser: మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్ళైన తర్వాత తన తొలి ప్రాజెక్ట్  'సతీ లీలావతి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న లావణ్య కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా ఈరోజు మూవీ టీజర్ విడుదల చేశారు. 

'సతీ లీలావతి' టీజర్

టీజర్ చూస్తుంటే 'సతీలీలావతి' భార్య భర్తల మధ్య జరిగే ఒక ఫన్నీ ఫ్యామిలీగా డ్రామా అని అర్థమవుతుంది. ఇందులో లావణ్య, దేవ్  భార్యాభర్తలుగా కనిపించగా.. వారిద్దరి మధ్య సన్నివేశాలు, కామెడీ సీన్స్ నవ్వులు పూయించారు. ముఖ్యంగా ఇద్దరి సంభాషణల్లో వచ్చే కౌంటర్స్, పంచ్ డైలాగ్స్ ప్రజెంట్ యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ తర్వాత మధ్య మధ్యలో వీటివీ గణేష్, కమెడియన్ సప్తగిరి సన్నివేశాలు అలరించాయి. మొత్తానికి టీజర్ పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వైబ్ అందించింది. రీసెంట్ గా  'మిస్ పర్ఫెక్ట్' సీరీస్ లో హోమ్లీ గర్ల్ గా కనిపించి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న లావణ్య.. ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో హిట్టు కొట్టేందుకు సిద్దమవుతున్నట్లు అనిపిస్తుంది.  సత్యా తాటినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై  నాగ మోహన్ నిర్మించారు. మిక్కీ జే మేయర్ సినిమాకు మ్యూజిక్ అందించారు. 

పెళ్లి తర్వాత కూడా..

ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా లావణ్య తన సినీ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చారు. ఫ్యామిలీ భర్త వరుణ్ తో కలిసి ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే లావణ్య- వరుణ్ మాల్దీవ్స్ లో తమ  'బేబీ మూన్'  వెకేషన్ ఎంజాయ్ చేశారు. ఈ వెకేషన్ కి సంబంధించిన ఫొటోలను వీడియోలను కూడా లావణ్య తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. మాల్దీవ్స్ అందాలను ఆస్వాదిస్తూ క్వాలిటీ సమయాన్ని గడిపారు కపుల్. 

బేబీ బంప్ వీడియో వైరల్ 

మాల్దీవ్స్ వెకేషన్ తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్న లావణ్య- వరుణ్ జంట ఎయిర్పోర్ట్ లో అందరి దృష్టిని ఆకర్షించారు. లావణ్య బేబీ బంప్ తో కనిపించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. లావణ్య- వరుణ్ త్వరలోనే తమ మొదటి బిడ్డకు వెల్కమ్ పలకబోతున్నారు. 

Also Read: Lavanya Tripati: ఎయిర్ పోర్ట్ లో 'బేబీ బంప్' తో లావణ్య త్రిపాఠి వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు