/rtv/media/media_files/2025/07/29/pawan-kalyan-2025-07-29-09-59-37.jpg)
pawan kalyan
Pawan kalyan: ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 34ఏళ్ళ తర్వాత తన చిరకాల స్నేహితుడిని కలిశానని... చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాదు, ఈ సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు.
రేన్షి రాజా..
అయితే పవన్ కళ్యాణ్ 1990లలో కోలీవుడ్ నటుడు, కరాటే శిక్షకుడు షిహాన్ హుసైని దగ్గర మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్న సమయంలో.. ఆయనతో పాటు శిక్షణ పొందిన తన సీనియర్, తిరు రేన్షి రాజాను పవన్ ఇప్పుడు పరిచయం చేశారు. రేన్షి రాజా తమిళనాడుకు చెందిన వారని, పవన్ గ్రీన్‌బెల్ట్ సాధించే సమయంలో ఆయన బ్లాక్‌బెల్ట్ సాధించారని పవన్ గుర్తుచేసుకున్నారు. తాము కరాటే శిక్షణ పొందిన స్కూల్‌ను ఇప్పటికీ రాజా విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించారు పవన్. ఈ సందర్భంగా తమ గురువు హుసైనితో ఉన్న జ్ఞాపకాలను కూడా పంచుకున్నామని తెలిపారు. హుసైని ఈ సంవత్సరం మార్చిలో బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు.
Also Read:Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' క్లైమాక్స్ గూస్ బంప్స్ .. సెట్స్ నుంచి లీకైన సీన్ వైరల్!
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఖాతాలో 2 సినిమాలు ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', మరొకటి సుజిత్ కాంబోలో 'ఓజీ'. ఓజీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న పవన్.. టైం దొరికినప్పుడల్లా ఉస్తాద్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.
ఇటీవలే విడుదలైన హరిహర వీరమల్లు పవన్ అభిమానులను ఆశించిన స్థాయిలో సంతోషపెట్టలేకపోయింది. దీంతో నెక్స్ట్ రెండు సినిమాలపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. డీసెంట్ ఓపినింగ్స్ తో మొదలైన వీరమల్లు కలెక్షన్స్ రెండో రోజు నుంచి భారీ పతనాన్ని చూశాయి. తొలి రోజు రూ. 34 కోట్లు వసూలు చేయగా.. రెండవ రోజు కేవలం రూ. 8 కోట్లతో 76.98% శాతానికి పడిపోయాయి. ఆ తర్వాత మూడో రోజు రూ. 9.25కోట్లు, నాల్గవ రోజు 9.86 కోట్లు వసూలు చేసింది. సాక్నిల్క్ నివేదిక ప్రకారం నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.88.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాలోని పూర్ వీఎకెక్స్ పై విమర్శలు రాగా.. చిత్రయూనిట్ మార్పులు చేసి మళ్ళీ ఎడిటెడ్ వెర్షన్ రిలీజ్ చేసింది. పూర్ వీఎకెక్స్ కలిగిన సన్నివేశాలను తొలగించిన తర్వాత.. సినిమా నిడివి దాదాపు 15 నిముషాలు తగ్గినట్లు తెలుస్తోంది.