Lailla: లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. ఏంటీ అరాచకం

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న 'లైలా' మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లో విశ్వక్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. ముఖ్యంగా లేడీ గెటప్ లో అదిరిపోయాడు. 'మనకు తెల్లగా చేసుడే కాదు..తోలు తీసుడు కూడా వచ్చు' అనే డైలాగ్‌ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

New Update

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'లైలా'. గతేడాది విశ్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ను అలరించలేకపోయింది. దీంతో ఈసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి 'లైలా' అంటూ వస్తున్నాడు. పలకరించనున్నాడు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రంలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'లైలా' టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌ లేడీ గెటప్‌లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. టీజర్ చివర్లో విశ్వక్ లేడీ గెటప్ అదిరిపోయింది. అమ్మాయిగా చాలా అందంగా కనిపించాడు.

'మనకు తెల్లగా చేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చు' అనే డైలాగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ డైలాగ్ తో సినిమాలో పక్కా మాస క్యారెక్టర్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు.  సినిమాలో విశ్వక్ సేన్ బార్బర్ సోను మోడల్, లైలా అనే రెండు పాత్ర‌ల్లో ఇందులో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున ఈ సినిమా విడుదల కానుంది.

సోషల్ మీడియాలో టీజర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. విశ్వక్ సేన్ కు లేడీ గెటప్ బాగా సూట్ అయిందని కొందరు అంటుంటే.. ఓ మాస్ హీరోతో లేడీ గెటప్ వేయించడం అనేది అరాచకం అయ్యా! అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ కూడా ఈ రోల్ యాక్సెప్ట్ చేయడం సినిమాపై అతనికున్న డెడికేషన్ ఏంటో అర్థమవుతోంది. అతని తోటి హీరోలు ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగం చేయకపోవడం గమనార్హం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు