/rtv/media/media_files/2025/10/15/vishwak-sen-funky-2025-10-15-11-55-26.jpg)
Vishwak Sen Funky
Vishwak Sen Funky: విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన గత సినిమా 'లైలా' ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఆయన కెరీర్‌కి కొంత గందరగోళం ఏర్పడింది. అయితే ఇప్పుడు విశ్వక్ మరోసారి ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ ఫంకీ, "జాతిరత్నాలు" ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
టీజర్‌తో పాజిటివ్ బజ్ (Vishwak Sen Funky Teaser)
'లైలా' రిజల్ట్ తర్వాత ఈ సినిమా గురించి మొదట్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఫంకీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయిన తరువాత మాత్రం పరిస్థితి మారిపోయింది. టీజర్‌లో చూపిన కామెడీ, విశ్వక్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దీనితో సినిమాపై పాజిటివ్ టాక్ మొదలైంది. అనుదీప్ మార్క్ పంచ్‌లు, ఫన్నీ సీన్స్ సినిమా మీద అంచనాలను పెంచేశాయి.
Also Read:రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఫంకీ సినిమాను క్రిస్మస్ (డిసెంబర్ 25, 2025) సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఇదే సమయంలో రోషన్ మేకా నటించిన 'చాంపియన్' మూవీ విడుదలకు రెడీ అవుతోంది. మొదట ఆదివి శేష్ నటించిన 'డకాయిట్' కూడా అదే డేట్‌కి అనౌన్స్ చేసినా, గాయాల వల్ల ఆ మూవీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది. దాంతో ఫంకీకి మంచి స్లోట్ దొరికే ఛాన్స్ ఉంది.
Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!
ఈ సినిమాలో హీరోయిన్‌గా కయాదు లోహార్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..
ఫంకీ సినిమా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తోంది. కామెడీ, వినోదం, విశ్వక్ ఎనర్జీ అన్నీ కలిసి ఈ సినిమా పండగ కాలంలో ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందించనుంది. ఇప్పటికి టీజర్‌తో మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా క్రిస్మస్ విడుదలకు వచ్చిందంటే, థియేటర్లలో నవ్వుల సందడి చేయనుంది.