‘ఫంకీ’గా విశ్వక్ సేన్.. ఆ దర్శకుడితో కొత్త సినిమా! ‘మెకానిక్ రాకీ’ మూవీతో అలరించిన విశ్వక్ ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ‘జాతి రత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి ‘ఫంకీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. By Seetha Ram 23 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ నుంచి ఎన్నో అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా! అయితే ఈ సినిమాలో విశ్వక్ యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. అలాగే హీరోయిన్లు తమ అందంతో సినీ ప్రియుల్ని అట్రాక్ట్ చేశారు. ఇక ఇప్పుడు విశ్వక్ నెక్స్ట్ మూవీపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. తన తదుపరి చిత్రం ఎలాంటి జానర్‌లో రాబోతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది కూడా చదవండి: జ్ఙాపకశక్తిని 10 రెట్లు పెంచే అద్భుతమైన ఆహారాలు విశ్వక్ కొత్త సినిమా ఈ నేపథ్యంలో విశ్వక్ కొత్త సినిమాకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తన తదుపరి చిత్రాన్ని ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇది విశ్వక్ కెరీర్‌లో 14వ సినిమాగా రాబోతుంది. గతంలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఇది కూడా చదవండి: అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్ స్వీట్ రియాక్షన్! ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. విశ్వక్ - అనుదీప్ కాంబోలో రాబోతున్న సినిమా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కామెడీతో అదిరిపోనుందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: తెలంగాణలో 13 నర్సింగ్ కాలేజీలకు అనుమతి విశ్వక్ డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్, అనుదీప్ సిగ్నేచర్ హ్యూమర్‌తో చేసే అద్భుతమైన సన్నివేశాలు అదిరిపోనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం టాప్ మోస్ట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. కాగా ఈ సినిమాకి ‘ఫంకీ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి. #tollywood #funky #anudeep kv #vishwak-sen మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి