/rtv/media/media_files/2025/06/01/lRXyDirwDUER1HlkzIlo.jpg)
rajendra prasad viral comments on ali
Rajendra Prasad: కమెడియన్ అలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందులో నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. ఈ మేరకు రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ పై ప్రసంగిస్తూ.. కమెడియన్ అలీపై (Comedian Ali) నోరు పారేసుకున్నారు. సరదాగా మాట్లాడుతున్న క్రమంలో కమెడియన్ అలీని ల***** అని దూషించారు.
Also Read : పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్‌మ్యాప్ ఇదే..!
మండిపడుతున్న నెటిజన్లు
ఈ వీడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తోటి నటీనటులతో పాటు నెటిజన్లు రాజేంద్రప్రసాద్ ప్రవర్తనపై మండిపడుతున్నారు. ''ఒక సీనియర్ నటుడు స్టేజిపై.. అది కూడా మీడియా సమక్షంలో మాట్లాడాల్సిన మాటలా ఇవి ?'' అని విమర్శిస్తున్నారు. ''నటనతో ఆకట్టుకుంటే సరిపోదు వ్యక్తిత్వంతోనూ ప్రజలను మెప్పించాలి'' అని కామెంట్లు చేస్తున్నారు.
వీడు ఎక్కడ లం****కు..
— Whynot Cinemas (@whynotcinemass_) June 1, 2025
బుద్ధి ఉందా లేదా..? ఎన్టీఆర్ గారి అవార్డు అంటే చప్పట్లు కొట్టరా..?
- #RajendraPrasadpic.twitter.com/yNwgUjFcpi
Also Read:Manchu Brothers: అంతా మనోజే చేయించాడు..కన్నప్ప హార్డ్ డ్రైవ్ విషయంలో విష్ణు సంచలన కామెంట్స్
గతంలోనూ
అయితే రాజేంద్రప్రసాద్ ఇలా పబ్లిక్ నోరు జారడం మొదటి సారి కాదు. గతంలో 'రాబిన్హుడ్' మూవీ ఈవెంట్ లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై కూడా ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారు. వార్నర్ పై దొంగ ము** కొడుకు అని నోరు జారారు. ఆ తర్వాత మళ్ళీ క్షమాపణలు కోరారు. అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావని.. తమ మధ్య మంచి స్నేహం ఉందని క్లారిటీ ఇచ్చారు.
Also Read: Miss World Opal Suchata: మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన తొలి థాయ్ మహిళ – ఓపల్ గురించి 10 రహస్యాలు!